»   » కొడుకు కోసం కెమెరా చేతపట్టి పవన్ కళ్యాణ్ (ఫోటో)

కొడుకు కోసం కెమెరా చేతపట్టి పవన్ కళ్యాణ్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కెమెరా చేత పట్టాడు. అయితే ఆయన కెమెరాతో సినిమాలేమీ తీయడం లేదు. నాన్నగా కొడుకు జ్ఞాపకాలను కెమెరాలో బంధించాడు. ముద్దుల కొడుకు అకీరా నందన్‌ వేదికపై నటిస్తుంటే పవన్‌ కళ్యాణ్‌ ఎంతో ముచ్చటపడిపోతూ తన సెల్‌ఫోన్‌ తీసుకొని తనయుడిని కెమెరాలో బంధించారు

అది చూసిన పవన్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ తండ్రీకొడుకులిద్దరినీ తన కెమెరాలో బంధించారు. ఆ మొత్తం తతంగాన్ని చూసిన పవన్‌ తనయ ఆధ్య చిరునవ్వులు చిందించిందట. ఆ విషయాల్ని ఇటీవల రేణుదేశాయ్‌ తన ట్విట్టర్‌ద్వారా వెల్లడించారు. ఆమె పోస్టు చేసిన ఫోటోను ఇక్కడ చూడొచ్చు.


Pawan filming his son's school concert

ఇటీవల పవన్ కళ్యాణ్ తన పిల్లలను కలిసేందుకు పుణె వెళ్లారు. అదే సమయంలో అకీరా పాఠశాలలో జరిగిన క్రిస్‌మస్‌ వేడుకలకి హాజరయ్యారు. ఈ వేడుకల్లో అకీరా కూడా పాల్గొనడంతో అతని పెర్ఫార్మెన్స్ చూసి ముచ్చటపడిన పవన్ సెల్ ఫోన్లో చిత్రీకరిస్తూ మురిసిపోయారు.


పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ఇద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే. పిల్లలు ఇద్దరూ రేణు దేశాయ్ వద్ద పూణెలో పెరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడూ వెళ్లి పిల్లలను కలుస్తున్నారు. దంపతులుగా విడిపోయినప్పటికీ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ మధ్య ఫ్రెండ్షిప్ మాత్రం కొనసాగుతూనే ఉంది.

English summary
"A beautiful moment when a father is filming his son not as a film maker but as a "dad" for his school concert...And it's even sweeter when Aadya is grinning seeing her mother click pics of her nana filming Akira bhaiya" Renu Desai said.
Please Wait while comments are loading...