twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజకీయాలపై రెండో వారంలోచెప్తా: పవన్‌కల్యాణ్‌

    By Srikanya
    |

    హైదరాబాద్‌:ఆదివారం రాత్రి పవన్‌కల్యాణ్‌ కార్యాలయం నుంచి ఓ పత్రికా ప్రకటన విడుదలైంది. పవన్‌కల్యాణ్‌ తన రాజకీయ ఆలోచనల గురించి ఈ నెల రెండో వారంలో స్వయంగా వెల్లడిస్తారని ఆ ప్రకటనలో తెలియజేశారు. ఆ సందర్భంలో రాజకీయాలపై తనకున్న అభిప్రాయాలనీ, పార్టీ, ఎన్నికల్లో పోటీ గురించి చెప్పబోతున్నారు.

    కొంతకాలంగా అన్నయ్య చిరంజీవితో పవన్‌కల్యాణ్‌ విభేదిస్తున్నారని కూడా సినీ, రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. మహా శివరాత్రి రోజున నాగబాబు కుమారుడు నటించే సినిమా ప్రారంభోత్సవంలోనూ చిరు, పవన్‌లు మాట్లాడుకోలేదనే విషయం చర్చనీయాంశమైంది. వీటికి తెరదించే ప్రయత్నం ఈ ప్రకటన ద్వారా చేశారు. తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌ తాను నటించే చిత్రాలకు సంబంధించిన కథాచర్చల్లో నిమగ్నమై ఉన్నారని తెలిపారు.

    Pawan to give clarity shortly!

    పవన్‌కల్యాణ్‌ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారా..! రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారా..! లేదా ఇప్పటికే ఉన్న పార్టీలో చేరబోతున్నారా!! ...ఇలాంటి ప్రచారం ఆదివారం ఉదయం నుంచి సోషల్‌ మీడియాలో విస్తృతంగా సాగింది. పవన్‌ కల్యాణ్‌ పార్టీ పేరు, లోగో వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని, ఆయన ఎంపీగా పోటీచేస్తారని సామాజిక మాధ్యమం హోరెత్తింది.

    Pawan to give clarity shortly!2

    పవన్‌కల్యాణ్‌ ఓ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారని, లేదంటే ఆయనే స్వయంగా ఓ పార్టీని స్థాపించే ఆలోచన చేస్తున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వూహాగానాల నేపథ్యంలో.. రాజకీయాలపై తనకున్న అభిప్రాయాల్ని వెల్లడించేందుకు పవన్‌కల్యాణ్‌ సన్నద్ధమవుతున్నారు. పవన్‌కల్యాణ్‌ తన రాజకీయ ఆలోచనల గురించి ఈ నెల రెండో వారంలో స్వయంగా వెల్లడిస్తారని ఆ ప్రకటనలో తెలియజేశారు.

    English summary
    By Sunday evening, a press statement from Pawan Kalyan's was released to the media. In its statement, Pawan Kalyan's office said that the star will talk to the media in the second week of March about various issues including the speculations about his political entry, launching a party, etc.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X