twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అరుదైన ఆ పుస్తకం రీప్రింట్ కు పవన్ ఆర్దిక సాయం

    By Srikanya
    |

    హైదరాబాద్: పవన్ ఏం చేసినా అందులో ఓ ఎమోషన్, ఓ అంతర్గత ఆలోచన కనపడుతుంది. రీసెంట్ గా ఆయన ఇంటర్వూల్లో ప్రస్తావించిన ఆధునిక మహాభారతం పుస్తకం గుర్తుండే ఉండి ఉంటుంది. పవన్ ఆ పుస్తకం గురించి చెప్పిన తర్వాత ఆ పుస్తకంలో ఏముంది, అసలు ఆ పుస్తకం ఏమిటి తిరగవేద్దామని చాలా మంది పుస్తకాలు షాపుల్లో వెతికారు. ఆన్ లైన్ బుక్ స్టోర్స్ లోనూ అన్వేషించారు. అయితే చాలామందికి ఆ పుస్తకం దొరకలేదు.

    ఎందుకు ఆ పుస్తకం దొరకలేదు అంటే ఆ పుస్తకం రీ ప్రింట్స్ వేయబడలేదు. మొదట్లో అంటే అప్పట్లో వేసిన ప్రింటెడ్ కాపీలే ఉన్నవాళ్లు చదువుకుంటున్నారు. పవన్ కు సైతం త్రివిక్రమ్ సెకండ్ హ్యాండ్ పుస్తకాల షాపులో దొరికితే దాన్ని గిప్ట్ గా ఇచ్చారు. పవన్ కు తెగ నచ్చేసింది.

     Pawan helps to reprint a rare book

    పవన్ టేబుల్ మీద ఆ పుస్తకం కనపడితే మీడియావారు ఇంటర్వూ చేయటానికి వెళ్లి.. ఏంటి... ఆధునిక మహాభారతం పుస్తకం ఇప్పుడు తిరగేస్తున్నారు? అంటే... గుంటూరు శేషేంద్ర శర్మగారు రాసిన పుస్తకం ఇది. ఆయన అభివ్యక్తి బాగుంటుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్నీ ప్రతిబింబించే పుస్తకం ఇది. కొన్ని పుస్తకాల్ని పదే పదే చదువుతుంటా. అలాంటి పుస్తకాల్లో ఇదొకటి అని సమాధానమిచ్చారు.

    తర్వాత ఆయన ఈ పుస్తకం గురించి ఎంక్వైరీ చేసారు. అందుతున్న సమాచారం ప్రకారం గుంటూరు శేషేంద్ర శర్మగారి అబ్బాయి సాత్యకిని పవన్ కలిసి, ఆ పుస్తకం రీ ప్రింట్ చేయటానికి ఫైనాన్సియల్ హెల్ప్ చేసారని తెలుస్తోంది. దాంతో ఇప్పుడు 25000 కాపీలు ప్రింట్ అవుతున్నాయి. కామన్ మ్యాన్ కు కూడా ఈ పుస్తకం అందాలని పవన్ ఆలోచించి, ఈ పుస్తకం రీ ప్రింట్ కు సహకరించారని తెలుస్తోంది. గొప్ప విషయం కదూ.

     Pawan helps to reprint a rare book

    ఇంతకీ పుస్తకంలో ఏముంది

    ఈ ఆధునిక మహాభారతం ...1970 నుంచి 1986 మధ్యకాలంలో ప్రచురించిన గుంటూరు శేషేంధ్ర శర్మ వచన కవితా సంకలనాల సమాహారం. 1984 వరకూ వెలుబడ్డ ఆ కవితా సంకలనాలను పర్వాలుగా రూపొందించారు. ఆంద్రప్రభ వారపత్రికలో వివరణలతో సహా ఆధునిక మహాభారతం ధారావాహికంగా ప్రచురింపబడింది. ఆ తర్వాత అంటే 1984-86లో ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రిక లో శేషేంద్రజాలం శీర్షికలో చిన్న కవితలు వెలుబడ్డడాయి. వీటికి అరుస్తున్న ఆద్మీ అని పేరు పెట్టారు. ఆధునిక మహాభారతంలో ఆద్మీ పర్వంగా దీన్ని చేర్చారు.

    అలాగే శేషేంద్ర ఆదునిక మహాభారతానికి, వ్యాసుడు రాసిన భారతానికి ఏం సంభందం లేదు. శేషేంద్ర శర్మ గారు ఈ విషయాన్ని చెప్తూనే ఆధునిక మహాభారతం అంటే నేటి మన భారతదేశం అని వివరించారు.

    English summary
    Pawan Kalyan met with the Guntur Seshendra Sharma’s son, gave him financial assistance and ensured that ‘Adhunika Mahabharatam’ new print run of 25000 copies is getting ready.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X