»   » పవన్ ని పెద్ద ఇడియట్ అనుకుంటారు:రామ్ గోపాల్ వర్మ

పవన్ ని పెద్ద ఇడియట్ అనుకుంటారు:రామ్ గోపాల్ వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హిట్ టాక్ తో దూసుకుపోతున్న పవన్ తాజా చిత్రం 'అత్తారింటికి దారేది'. ఈ చిత్రం గురించి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికరమైన కామెంట్స్ ట్విట్టర్స్ లో చేసారు. ' నా మొత్తం కెరీర్లో నేను ఏ సినిమా కలెక్షన్స్ కి షాక్ అవ్వని రీతిలో అత్తారింటికి దారేది సినిమా కలెక్షన్స్ చూసి షాక్ అయ్యానని తరన్ ఆదర్శ్ నాతో అన్నాడు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో మొదటిసారి హాలీవుడ్ ఫిల్మ్ కంపెనీలు తెలుగు సినిమా సినిమా అయిన అత్తారింటికి దారేది కలెక్షన్స్ ని ట్రాక్ చేస్తున్నాయని' వర్మ ట్వీట్ చేసాడు.

Pawan is biggest idiot if he doesn’t start own party : RGV

అలాగే ఇంకా ఏమన్నారంటే...

* చాలా ప్రాంతాల్లో రేషియో లెవిల్లో అత్తారింటికి దారేది చిత్రం చెన్నై ఎక్సప్రెస్ ని క్రాస్ చేసింది.

*సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం లైఫ్ టైమ్ కలెక్షన్స్ .. మూడు రోజులు 'అత్తారింటికి దారేది' కలెక్షన్స్ కన్నా తక్కువ.

*ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో మొదటిసారి హాలీవుడ్ ఫిల్మ్ కంపెనీలు తెలుగు సినిమా సినిమా అయిన అత్తారింటికి దారేది కలెక్షన్స్ ని ట్రాక్ చేస్తున్నాయి

* తరుణ్ ఆదర్శ్ రిపోర్ట్ లతో బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం అత్తారింటికి దారేది చిత్రం గురించే మాట్లాడుకుంటోంది.

* 'అత్తారింటికి దారేది' కలెక్షన్స్ చూసి అమెరికన్ డిస్ట్రిబ్యూటర్స్, థియోటర్ ఓనర్స్ ... ఆ టైటిల్ పలకటం నేర్చుకుంటున్నారు

* చిరంజీవిగారు 40 ఏళ్ళ తర్వాత ఇంకా పర్వతం మొదలు దగ్గరే ఉంటే... పవన్ కళ్యాణ్..హిమాలయాలను చేరుకున్నారు.

*పవర్ స్టార్ కి పోలిస్తే మెగాస్టార్ వంటి పేర్లు చాలా చిన్నవి అతను.. సునామి స్టార్ గా మార్చుకోవాలి

*ఈ రేంజి సక్సెస్ అంతా పవన్ కళ్యాణ్ ది కాదు...అతన్ని ప్రేమించే వ్యక్తులది

* ఇదంతా చూసాక కూడా ఆయన ఇష్టపడే జనాల కోసం కళ్యాణ్ సొంత పార్టీ పెట్టకపోతే ఆయన్ని పెద్ద ఇడియట్ అనుకుంటారు

English summary
RGV has been asking Pawan Kalyan to form his own political party for quite some time now. Today, he went a step further. ” Even after this proof of how much people love him if Kalyan still doesn’t start his own party he will be the biggest idiot. I just hope that Pawan Kalyan realises that this earth shattering success (of AD) is not because of him but it is because of peoples love towards him”, tweeted RGV.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu