»   » పొల్లాచిలో పవన్ కళ్యాణ్ ‘కాళీ’ హల్ చల్...!

పొల్లాచిలో పవన్ కళ్యాణ్ ‘కాళీ’ హల్ చల్...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా విష్ణువర్ధన్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్ ఈరోజు (జూలై 19) నుంచి తమిళనాడులోని పొల్లాచ్చిలో జరుగుతోంది. కోయంబత్తూర్ సమీపంలోని పొల్లాచ్చి కొబ్బరి చెట్లతో కూడిన పంటపొలాలతో ... ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఇక్కడ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను, పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ షూటింగులో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ ఈరోజు బయలుదేరి వెళుతున్నారు. ఇదిలా ఉంచితే, ఈ చిత్రానికి సంబంధించిన కోల్ కతా షూటింగ్ షెడ్యులు ఇటీవలే పూర్తయింది. దీనికి 'కాళీ' అనే టైటిల్ పరిశీలనలో వుంది.

ఆర్కామీడియా పతాకంపై శోభూ యార్లగడ్డ, నీలిమా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సారాజేన్ డయాస్, అంజలి లావణ్య కథానాయికలు. నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'కోల్‌కతాలో జరిగిన షెడ్యూల్‌లో చిత్ర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. నేటి నుండి కేరళలో మరో షెడ్యూల్ ప్రారంభిస్తున్నాం. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్ సరికొత్తగా కనిపిస్తాడు. తమిళంలో 'బిల్లా"లాంటి కమర్షియల్ హిట్ చిత్రాన్నందించిన దర్శకుడు విష్ణువర్ధన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు. సంగీత దర్శకుడు యువన్‌ శంకర్ రాజా క్లాస్, మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా విలక్షణ బాణీలను సమకూర్చుతున్నాడు. సంగీతం సినిమాకి ప్రధానాకర్షణగా నిలుస్తుంది.

'తీన్‌మార్"లాంటి రొమాంటిక్ ఎంటర్‌ టైనర్ తర్వాత పవన్‌ కళ్యాణ్ కెరీర్‌ లో మరో వైవిధ్యమైన చిత్రమవుతుంది" అన్నారు. జాకీషరఫ్, అడవి శేషు('కర్మ" ఫేమ్), అతుల్‌కులకర్ణి, తనికెళ్ల భరణి, అలీ, బ్రహ్మానందం, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోక్షిగఫీ: పి.యస్.వినోద్, మాటలు: అబ్బూరి రవి, ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్, స్క్రీన్‌ప్లే: రాహుల్‌కోడా, కథ, దర్శకత్వం: విష్ణువర్ధన్.

English summary
The latest schedule of Pawan Kalyan starrer Kaali is progressing in Pollachi. Pawan Kalyan and other cast of the film are shooting for few vital scenes in the film. 50% of the film’s shoot have been wrapped up in Kolkata schedule while the remaining shoot is being shot in Pollachi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu