»   » ఫస్ట్ లుక్ మళ్ళీ వాయిదా.? దసరా కి మళ్ళీ పవన్ ఫ్యాన్స్ కి నిరాశేనా!!?

ఫస్ట్ లుక్ మళ్ళీ వాయిదా.? దసరా కి మళ్ళీ పవన్ ఫ్యాన్స్ కి నిరాశేనా!!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా రిలీజ్ ముందే సంచలనాలు నమోదు చేస్తోంది. సాధారణంగా పవర్ స్టార్ సినిమా అంటేనే హైప్ ఓ రేంజిలో ఉంటుంది. దానికి త్రివిక్రమ్ లాంటి దర్శకుడు తోడైతే బాక్సాఫీసు రికార్డ్స్ బద్దలవ్వాల్సిందే, శాటిలైట్ రైట్స్‌కు భారీగా డిమాండ్ రావాల్సిందే. వచ్చింది కూడా మరో వైపు ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగబోతోంది. ఇప్పటికే అన్ని ఏరియాలకు ముందస్తుగానే భారీగా థియేట్రికల్ రైట్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రూ. 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని అంచనా..

అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి గానీ ఇప్పటివరకూ అసలుదే ఇంకా రాలేదు. ఇప్పటివరకు సినిమా ఫస్ట్ లుక్ ని గాని టైటిల్ ని గాని రిలీజ్ చెయ్యలేదు. అందుకు బలమైన కారణం ఉందట. సినిమాకి తగ్గట్టు క్యాచిగా ఉండే టైటిల్ సెలెక్ట్ చేసే పనిలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది.

Pawan Kalyan 25th Film First Look Is Not Releasing

సో పూర్తిగా దానిపై ఓ నిర్ణయానికి వచ్చాక అనౌన్స్ చేస్తాడట. అసలైతే దసరా కే టైటిల్ ఫస్ట్ లుక్ రావాలి. కానీ సినిమా అనుకున్న టైమ్ కి షూటింగ్ పూర్తి చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ లుక్ లాంచ్ డేట్ ని మరొక డేట్ కి చేంజ్ చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబో కాబట్టి సినిమా బిజినెస్ వ్యవహారాలు కూడా అన్ని అయిపోయాయట.

ముఖ్యంగా ఓవర్సీస్ లో 20 కోట్లకు అమ్ముడుపోయిందని టాక్ వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పవన్ సినిమా రికార్డు స్థాయిలో బిజినెస్ చేయనుందని సమాచారం. ఇక ఈ సినిమాను జనవరి 10న సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయడానికి సన్నహకలు చేస్తున్నారు. పవన్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

English summary
Now the news is Reported that the First Look poster not yet releasing on This Dussera
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu