హరికృష్ణ విషాద వార్త వినాల్సి వస్తుందనుకోలేదు, ఈ రోజు అన్నీ రద్దు: పవన్ కళ్యాణ్
Recommended Video

సినీ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మరణంపై పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. యాక్సిడెంట్ జరిగిందనే విషయం తెలియగానే ఆయన గాయాలతో బయటపడతారని భావించాను. అంతలోనే విషాద వార్త వినాల్సి వచ్చింది. ఆయన మరణంతో నన్ను ఎంతగానో కలిచి వేసింది అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
'సినీ, రాజకీయ రంగాలకు హరికృష్ణ సేవలు మరచిపోలేనివని వ్యాఖ్యానించిన పవన్, హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఈ విషాద సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్లే శక్తిని ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని, తన తరఫున, జనసేన శ్రేణుల తరఫున ఆయనకు నివాళులు అర్పిస్తున్నానని అన్నారు.

సంతాపంగా అధికారిక కార్యక్రమాలు రద్దు
ఈ రోజు జనసేన కార్యాలయంలో ముఖ్య నాయకులు చేరికలు, గిడుగు రామమూర్తి జయంతి వేడుకల నిర్వహణ ఉన్నాయి. వాటిని సహృదయులు శ్రీ హరికృష్ణ మృతికి సంతాప సూచకండా రద్దు చేస్తున్నామని తెలిపారు

రేపు అంత్యక్రియలు
కాగా... హరికృష్ణ భౌతికకాయాన్ని నార్కట్‌పల్లి ఆసుపత్రి నుండి హైదరాబాద్ మెహదీపట్నంలోని ఆయన ఇంటికి తీసుకొస్తున్నారు. గురువారం మొయినాబాద్‌లోని ఫాం హౌస్‌లో అంత్యక్రియలు జరుగనున్నాయి.

మోహన్ బాబు
హరికృష్ణ మరణం పట్ల మోహన్ బాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తన సోదరుడిని కోల్పోయానని, ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని చెప్పారు. తన జీవితంలో అత్యంత విలువైనదాన్ని కోల్పోయాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
సిమ్రన్
‘నందమూరి హరికృష్ణ ఇక లేరన్న వార్త వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా' అని హరికృష్ణ హీరోగా తెరకెక్కిన సీతయ్య మూవీలో హీరోయిన్‌గా నటించిన సిమ్రాన్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











