twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాబాయ్ పవన్ కల్యాణ్ చెప్పాడని.. శ్రీమంతుడిగా మారిన రాంచరణ్!

    |

    Recommended Video

    Charan Heeds Kalyan Babai Advice To Adopt AP Village Hit By Titli

    తిత్లి తుఫాన్‌తో బాధపడుతున్న ఉత్తరాంధ్రను ఆదుకొనేందుకు సినీ ప్రముఖులంతా స్పందిస్తున్నారు. ఇప్పటికే సంపూర్ణేష్ బాబు ఆర్థిక సహాయాన్నిఅందించడమే కాకుండా స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇక నిఖిల్ బియ్యం, నిత్యావసవర వస్తువులను తుఫాన్ బాధిత ప్రాంతాలకు తరలించారు. మిగితా సినీ ప్రముఖులు ఆర్థికంగా సహాయం అందిస్తూ తమ ఔదర్యాన్ని చాటుకొంటున్నారు. ఈ నేపథ్యంలో రాంచరణ్ విభిన్నంగా స్పందిస్తూ ఓ ప్రకటన జారీ చేశాడు. అదేమిటంటే..

    బాబాయ్ పవన్ సూచన మేరకు

    బాబాయ్ పవన్ సూచన మేరకు

    తిత్లి తుఫాన్‌తో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు దారుణంగా దెబ్బ తిన్నాయి. ఆ ప్రాంతాలకు నా వంతుగా సహాయం చేయాలని భావించాను. కానీ దెబ్బతిన్న గ్రామాల్లో ఒకదానిని దత్తత తీసుకోమని బాబాయ్ పవన్ కల్యాణ్ నాకు ఓ సలహా ఇచ్చాడు అని ప్రకటనలో తెలిపాడు.

    పవన్‌ చేస్తే మీకేం నొప్పి.. మీరు పీకడానికి? పర్సనల్ లైఫ్ వద్దు.. మాధవీలత వార్నింగ్ పవన్‌ చేస్తే మీకేం నొప్పి.. మీరు పీకడానికి? పర్సనల్ లైఫ్ వద్దు.. మాధవీలత వార్నింగ్

    పవన్ ఆలోచన నాకు బాగా నచ్చింది

    పవన్ ఆలోచన నాకు బాగా నచ్చింది

    బాబాయ్ పవన్ కల్యాణ్ చెప్పిన అద్భుతమైన ఆలోచన నాకు బాగా నచ్చింది. బాబాయ్ చెప్పిన విషయం నాకు చాలా సంతోషం కలిగించింది. ఆయన సలహా మేరకు నేను ఓ గ్రామాన్ని దత్తత తీసుకొంటాను అని రాంచరణ్ పేర్కొన్నాడు.

    గ్రామాల దత్తత కోసం నాజట్టు

    గ్రామాల దత్తత కోసం నాజట్టు

    శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని గ్రామాల దతత్తకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని నా జట్టుకు చెప్పాను. వారు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. త్వరలోనే ఏ గ్రామాన్ని దత్తత తీసుకొంటానో వెల్లడిస్తాను అని మెగా పవర్‌స్టార్ అన్నారు.

     తుఫాన్ బాధితులకు నా సేవలు

    తుఫాన్ బాధితులకు నా సేవలు

    నా సేవలు ప్రత్యక్షంగా గ్రామాలకు లబ్ది చేకూరే విధంగా నా టీమ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాను. తుపాన్ బాధిత ప్రాంతాలకు పూర్తిగా మేలు జరుగాలన్నదే నా ఉద్దేశం అని రాంచరణ్ వెల్లడించారు.

    English summary
    Mega Power Star Ram Charan responded to help to Cyclone effected North Andhra. He said that according to Pawan Kalyans advice, I am thinking to adopt a village from Srikakulam and Vijayanagaram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X