»   » పవన్ ఫుడ్ మెనూ మరిపోయిందా..? అన్నం కూడా మానేసాడు

పవన్ ఫుడ్ మెనూ మరిపోయిందా..? అన్నం కూడా మానేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మార్షల్ ఆర్ట్స్ లో ఆరి తేరిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటినుంచీ ఫిట్నెస్ మాత్రమే కాదు లుక్ విషయంలో కూడా చాలజాగ్రత్తగా మెయిన్ టైన్ చేస్తున్నాడు. అయితే ఇన్నేళ్లూ ఎలాంటి సమస్య రాలేదుకానీ ఇప్పుడు మాత్రం తేడా కనిపిస్తోంది అని త్రివిక్రమ్ పవన్ కు తన అభిప్రాయాలను తెలియ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమధ్య జరిగిన కొన్ని ప్రెస్ మీట్స్ లో పవన్ మొహం కాస్త ఉబ్బినట్లుగా ఉన్న విషయాన్ని త్రివిక్రమ్ గుర్తించిభోజనం లో మార్పు చేయించాడట.

సమస్య వచ్చిపడింది

సమస్య వచ్చిపడింది

తన హైట్ కు తగిన వెయిట్ తో యాక్టివ్ గా ఉండే పవన్ కు ఇప్పుడు కొత్తగా ఓ సమస్య వచ్చిపడింది. మామూలుగా వైట్ రైస్, కూరలు మినహా వేరే ఆహారాన్ని పవన్ ఎక్కువగా తీసుకోడట. అయితే, ఇప్పుడు ఆ వైట్ రైస్ ను దూరంగా పెట్టాలని పవన్ నిర్ణయించుకున్నాడట. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సూచన మేరకు పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

లుక్స్ చాలా ఇంపార్టెంట్

లుక్స్ చాలా ఇంపార్టెంట్

ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ తో తీస్తున్న సినిమాకు సంబంధించి త్వరలో పాటలు కూడ చిత్రీకరించబోతున్న నేపధ్యంలో పవన్ కళ్యాణ్ లుక్స్ చాలా ఇంపార్టెంట్ కావడంతోనే ఇలాంటి సజషన్ ఇచ్చాడట త్రివిక్రమ్.. వాస్తవానికి సర్దార్ గబ్బర్ సింగ్.. కాటమరాయుడు మూవీ ల విషయంలో కూడా పవన్ లుక్స్ కి నెగిటివ్ మార్క్ పడిన నేపధ్యంలో.

త్రివిక్రమ్ ఒత్తిడి

త్రివిక్రమ్ ఒత్తిడి

అత్తారింటికి దారేది మూవీలోని పవన్ లుక్ లా కనిపించాలి అంటే పవన్ తన అలవాట్లను మానుకొని స్ట్రిక్ట్ గా డైట్ పాటించక తప్పదని త్రివిక్రమ్ పవన్ పై ఒత్తిడి చేసి పవన్ ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు చేస్తున్నాడని ఫిలిం నగర్ గాసిప్. ఈ చిత్రం షూటింగ్ జరిగినన్ని రోజులు వైట్ రైస్ లేకుండా మెనూ సిద్ధం చేసుకోవాలని పవన్ నిర్ణయించుకున్నాడట.

రామోజీ ఫిల్మ్ సిటీలో

రామోజీ ఫిల్మ్ సిటీలో

దాదాపు 30 కోట్లతో రూపొందుతున్న ఈ సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఐదుకోట్ల స్పెషల్ సెట్ లో షూటింగ్ జరుగుతుంది. ఇక గత సినిమాల్లో పవన్ ని స్టైలిష్ గా చూపించిన త్రివిక్రమ్ ఈ సినిమాకోసం కూడా కొత్తగా మేకోవార్ చేయించాడని అంటున్నారు. ఇందులో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో పవన్ కనిపిస్తాడట.

English summary
Trivikram wants Pawan to be fit and stylish in his movie. After noticing the face of PK bloating up, The Filmmaker advised his good friend not to eat rice anymore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X