పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఎ.ఎం.రత్నం కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా శ్రీ సాయిరాం క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 4గా కొత్త చిత్రం విజయదశమి సందర్భంగా ఫిలింనగర్‌లోని నిర్మాణ సంస్థ కార్యాలయంలో లాంచనంగా ప్రారంభమైంది. సూర్య మూవీస్ అధినేత ఎ.ఎం.రత్నం ఈ చిత్ర సమర్పకుడుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఆర్.టి.నేసన్ దర్శకత్వంలో ఎస్.ఐశ్వర్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఎ.ఎం.రత్నం, శరత్ మరార్, జ్యోతికృష్ణ, ఆర్.టి.నేసన్, ఎ.ఎం.రత్నం సోదరుడు దయాకర్ తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే మిగతా నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలను తెలియజేస్తారు.


Click it and Unblock the Notifications











