»   » కత్తి మహేష్ వివాదం పై నోరు విప్పిన పవన్: పేరు ఎత్తకుండానే ఇలా చెప్పాడు

కత్తి మహేష్ వివాదం పై నోరు విప్పిన పవన్: పేరు ఎత్తకుండానే ఇలా చెప్పాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Pawan Kalyan Reacted On Katti Mahesh Controversy

సినీ విమర్శకుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వివాదం మరింత ముదురుతోంది. టీవీ చర్చా కార్యక్రమాలు, పలు ఇంటర్వ్యూలు వీరి మధ్య వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లు అవుతోంది. దాదాపు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో తెలుగు జనాలందరికీ ఒక్కటే హాట్ టాపిక్ "కత్తి మహేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్" ఎక్కడ చూసినా ఇదే రచ్చ. అయితే ఈ వివాదం పై పవన్ ఇప్పటి వరకూ నోరు మెదపకుండానే ఉన్నాడు. "అసలు పవన్" ఎందుకింత మౌనంగా ఉండిపోయాడు అని చాలామందే ఆశ్చర్య పోయారు కూడా. అయితే నిన్న పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలతో మాట్లాడుతూ చెప్పిన మాటలు ఇప్పుడు బయటకి వచ్చాయి. ఆ వీడియోలో పవన్ చెప్పిన విషయాలేమిటంటే...

వాళ్ళలా అయిపోతారంతే

వాళ్ళలా అయిపోతారంతే

చెప్పాను కదా నేను సినిమాల్లో ఉన్నప్పుడే ఇలాంటి క్యాంపెయిన్ ఉంటుంది. ఎవ్వరికైనా సరే బలమైన గొంతూ వాదనా ఉన్నప్పుడు ఇరిటేట్ అయిపోతారు. వాళ్లకి ఎవరూ ఏమీ చెయ్యక్కర లేదు. వాళ్ళలా అయిపోతారంతే. నేను సినిమాల్లో ఉన్నప్పుడు కూడా ఇలాన్టి వాళ్ళు ఉన్నారు..

భరించటానికి సిద్దంగా ఉన్నాను

భరించటానికి సిద్దంగా ఉన్నాను

నేనేమంటానంటే ఇవన్నీ టైమ్ టెస్టింగ్. నన్ను తిట్టేవాళ్ళుంటారు, మెచ్చుకునే వాళ్ళుంటారు, సపోర్ట్ చేసేవాళ్ళూ ఉంటారు, ఇవన్నీ నేను భరించటానికి సిద్దంగా ఉన్నాను. నా పర్సనల్ విషయాల కోసం ట్విటర్ వాడను, నా సినిమాలగురించి నేను ట్వీట్ చేయను, అక్కడికి వచ్చి ఎవరైనా గాయపడతారేమో అని నా సినిమాలకి సంబందించిన ఫంక్షన్లు చేయను.

ఎంతమంది ఉంటారు?

ఎంతమంది ఉంటారు?

కానీ పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు జనం మధ్యలోకి వేళ్ళాలి ఇబ్బందులుంటాయ్. అందరికీ నచ్చాలనేం లేదు, నచ్చటానికి బంగారాన్ని కాను. నేను మనిషిని వాళ్ళకి నాలో నచ్చే విషయాలుంటాయ్, నచ్చని విషయాలుంటాయ్. అయితే ఎవరు ఎన్ని చేసిన పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎంతమంది ఉంటారు? నన్ను ద్వేషించి వాళ్ళ కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారనే అనుకుంటాను.

మీరుకూడా అట్లాగే ఉండండి.

మీరుకూడా అట్లాగే ఉండండి.

నన్ను ద్వేషిస్తే వాళ్ళకి ఏం వస్తుందీ, నవ్వటానికి కొన్ని కండరాలు కదిలితే చాలు కానీ ఒకరిని ద్వేషించాలంటే వాళ్ళ బ్లడ్ పొల్యుట్ అవుతుందీ, వాళ్ళ మొహం లో మజిల్స్ దెబ్బ తింటాయ్ నాకిదంతా పడదు. వాళ్ళని వాల్లే పాడు చేసుకుంటున్నారు. నాకదేం పట్టదసలు.. మీరుకూడా అట్లాగే ఉండండి.

చచ్చిపోయేంత సహనం అవసరం లేదు

చచ్చిపోయేంత సహనం అవసరం లేదు

సహనం ఉండాలి కానీ మనం చచ్చిపోయేంత సహనం అవసరం లేదు. మనం ఎవరి మీద దాడి చేయం కానీ మనలని ఎవరైనా కొడుతుంటూంటే చేతులుకూడా అడ్డు పెట్టకుండా కొట్టమని చెప్తామా? అందుకే మనం చేతులు కట్టుకోని కూచునే పనిలేదు గానీ సేం తైం ఎదురు దాడి చేయాల్సిన అవసరం కూడా లేదు.

మనల్ని గార్డ్ చేసుకుందామంతే

మనల్ని గార్డ్ చేసుకుందామంతే

అవసరం అయితేనే కనీసం మనల్ని గార్డ్ చేసుకుందామంతే. ఎవరైనా మనలని క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఎంతో చూడండి మీకే అర్థమైపోతుంది. అనవసరంగా గోలచేసి ఇలాంటోళ్ళని పెంచి పెద్ద చేయటం తప్ప ఇంకేం లేదు.

టీవీ చూడను

టీవీ చూడను

నేను పర్పస్ ఫుల్ గా టీవీ చూడను, మిగతా ఇష్యూస్ మీద నా మైండ్ పెట్టటానికిచాలా సెలక్టివ్ గా ఎవర్నైనా అడుగుతాను ఎం జరుగుతుందీ అని..? ఎవరైనా తిడితే మాత్రం నాకు చెప్పకండీ అంటాను. మెచ్చుకున్నారూ అంటే దేశం బాగానే ఉందీ అనుకుంటాను. అలాగే తిట్టేవాళ్ళున్నారంటే భరిస్తాను.

పాలిటిక్స్ అలా కాదు

పాలిటిక్స్ అలా కాదు

మీరు సున్నితంగా ఉండకూడదు మీరు నన్ను సినిమాల్లో చూస్తున్నారు. అక్కడ మనం హీరోలం కాబట్టి విలన్లని కొడతాం అక్కడెవరూ మాట్లాడరు అది రెండున్నర గంటల్లో అయిపోతుంది. కానీ పాలిటిక్స్ అలా కాదు, నన్ను షబ్బీర్ అలీ గారు తిడతారు, దానం నాగేందర్ తిడతారు కానీ బయటెక్కడైనా ఫంక్షన్లలో కలిస్తే మామూలుగా నవ్వుతూనే మాట్లాడుకుంటాం.

అది బేసిక్ కర్టెసీ

అది బేసిక్ కర్టెసీ

అలాగే నూ చాలామందిని తిడతాను తర్వాత బయట మాట్లాడుకుంటాం... ఎందుకంటే..! అది బేసిక్ కర్టెసీ. అలా అని చెప్పి నేను కూడా ఒక మాట అలా అనేయను ప్రతీ మాటనీ ఆలోచించే మాట్లాడతాను ఒక పదం అన్నానూ అంటే వెనకడుగు వేయను.. ఆరోపణ కానీ టిల్ దట్ పాయింట్ మాత్రమే. (వ్యక్తిగత ద్వేషం కాదు). అంటూ అభిమానులకు చెప్పాడు పవన్.

English summary
Power Star Pawan kalyan reacted on Katti Mahesh controversy
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu