»   » 'ఆటో నగర్ సూర్య' గా పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడా?

'ఆటో నగర్ సూర్య' గా పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

వెన్నెల, ప్రస్తానం చిత్రాల దర్శకుడు దేవకట్టా తన తదుపరి చిత్రం ఆటోనగర్ సూర్య ని రూపొందించటానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.రీసెంట్ ఈ చిత్రం డైలాగ్ టీజర్ ని కూడా నెట్ లో విడుదల చేసారు. అయితే ఈ చిత్రంలో హీరో గా ఎవరు చేయనున్నారనే సంగతి ఇప్పటివరకూ తేలలేదు. కాని ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రం ఈ చిత్రం చేయటానికి పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపుతున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు దేవకట్టా త్వరలో ఈ చిత్రం పూర్తి స్క్రిప్టుని పవన్ కి వినిపించనున్నారని చెప్తున్నారు. ఇక దర్శకుడు కూడా ఈ కధని పవన్ గ్యారెంటీగా ఓకే చేస్తాడని గట్టి నమ్మకంతో ఉన్నారు.

ఇక టీజర్ లోని ఆ డైలాగు......" చూడు బాబాయ్...కొట్టుకు చావటానికి మన మధ్య ప్యాక్షన్ గొడవలు లేవు...భూమి మీద పుట్టిన ప్రతీ మనిషికీ ఒక హక్కుంది. ఎదగడం..తెలిసిన పనిచేసుకుంటూ కెపాసిటీకి తగ్గట్లు ఎదగడం..కానీ ఆ హక్కుని కబ్జా చేసి ఎదడమే నీ లాంటి లోఫర్లు హక్కు అనుకుంటారు. హిస్టరీలో జరిగిన ప్రతీ పోరాటానికి, విప్లవానికి, యుద్దానికి ఇదే కారణం. అవును నేను అనాధనే కానీ అనామకుడ్ని కాను...నా పేరు సూర్య...ఆటోనగర్ సూర్య. బాంచెత్...నేను ముట్టుకుంటే రిపేర్ చేయలేని వస్తువు లేదు.." అంటూ ఈ టీజర్ బేస్ వాయిస్ తో సాగుతుంది.

ఇక ఈ చిత్రం గురించి చెబుతూ...ఎవరూ లేని ఓ వ్యక్తి అందరివాడుగా మారటమే అంటున్నారు. అలాగే ఈ చిత్రం ట్రేడ్ యూనియన్స్ బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ పూర్తయి...నటీనటులు, సాంకేతిక గణం ఎంపిక జరుగుతోంది అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu