Just In
- 40 min ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 1 hr ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 2 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 3 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- News
చెక్కు చెదరని ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మా: పెద్దపీట వేసిన తెలంగాణ, ఒడిశా, గోవా
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డబ్బు నీళ్లలా ఖర్చు, పవన్ కళ్యాణ్‌ను పిలిచేది అందుకేనా?
హైదరాబాద్: నిఖిల్ కుమార్ హీరోగా హెచ్.డి. కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్ బ్యానర్‌పై ఎ.మహాదేవ్ దర్శకత్వంలో అనితా కుమారస్వామి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'జాగ్వార్'. ఈ నిఖిల్ కుమార్ ఎవరో కాదు... మాజీ ప్రధాని, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి దేవెగౌడ మనవడు, కన్నడంలో అనేక సూపర్‌హిట్ చిత్రాలు నిర్మించిన హెచ్.డి. కుమారస్వామి తనయుడు.
75 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. నిఖిల్ కుమార్ తండ్రే నిర్మాత కావడంతో ఖర్చుకు ఏమాత్రం వెనకాడటం లేదు. ఆ మధ్య టీజర్ రిలీజ్ కార్యక్రమం కూడా హైదరాబాద్ లో ప్రముఖుల మధ్య గ్రాండ్ గా నిర్వహించారు.
ఈ సినిమా తెరకెక్కుతోంది కన్నడలోనే అయినా... తెలుగు మార్కెట్ మీద బాగా ఫోకస్ పెట్టారు. అందుకే సెప్టెంబర్ 18న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్ ప్లాన్ చేసారు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.
ఆడియో వేడుకకు కూడా షాకయ్యే రేంజిలో ఖర్చు పెడుతున్నారు. సినిమాలో స్టార్ హీరోయిన్ తో ఐటం సాంగ్ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఆమెకు దాదాపు రూ. 2 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారట. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో..

అందుకేనా పవన్?
పవన్ కళ్యాణ్ ఆడియో వేడుకకు వస్తే సినిమా హిట్టవుతుందనే సెంటిమెంటు ఉంది. పైగా పవన్ కళ్యాణ్ ఆడియో వేడుకకు వస్తే మీడియాలో ఈ సినిమా గురించి బాగా పబ్లిసిటీ అవుతుంది. ఆయన అభిమానులు కూడా ఈ సినిమాపై ఆసక్తి పెంచుకునే అవకాశం ఉంది.

ఆడియో వేడేకకు కోటికిపైగా.
హైదరాబాద్ లో జరిగే జాగ్వార్ ఆడియో వేడుకకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులందరినీ పిలుస్తున్నారు. ఆడియో వేడుక తర్వాత సినిమాపై హైప్ భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు. కేవలం ఆడియో వేడుక కోసమే దాదాపు రూ. 1 కోటి వరకు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం.

శృతి హాసన్ తో
ఈ సినిమాలో ఐటం సాంగ్ చేసేందుకు శృతి హాసన్ ను సంప్రదించినట్లు సమాచారం. ఇందుకోసం ఆమెకు రూ. 2 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు టాక్.

తన కొడుకు గురించి..
ఈ సినిమాని తెలుగులో చేయడానికి కారణం విజయేంద్రప్రసాద్‌గారు. కథ చెప్పడానికి వచ్చిన ఆయన కన్నడలోనే సినిమా ఎందుకు చేస్తున్నారు? తెలుగులో కూడా చేయండి. మీ అబ్బాయి మంచి హీరో అవుతాడని ఆయన అన్న మాటతో ఈ సినిమాను కన్నడ, తెలుగులో చేస్తున్నాను అని నిర్మాత కుమారస్వామి తెలిపారు.

బెస్ట్ మూవీ
దర్శకుడు మహదేవ్ బాగా కష్టపడ్డాడు. సినిమా చాలా బాగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులు నా బిడ్డని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. 2016లో విడుదలయ్యే సినిమాల్లో ఇది బెస్ట్ మూవీగా నిలుస్తుంది అన్నారు నిర్మాత.

హీరో నిఖిల్ మాట్లాడుతూ...
నాకు తెలుగంటే ఇష్టం. ఎక్కువగా తెలుగు సినిమాలను చూస్తుంటాను. విజయేంద్ర ప్రసాద్‌గారు మా నాన్నగారిని కలవడానికి వచ్చినపుడు మీ అబ్బాయిని మా అబ్బాయి అనుకుని నా చేతుల్లో పెట్టండి అన్నారు. అది నాకిప్పటికీ గుర్తే. అలా మంచి కథను సిద్ధం చేశారు. మా నాన్నగారు నాకోసం ఎంతో చేశారు. ఆయనకు నేను ఏం చేసినా తక్కువే అవుతుంది అన్నారు.

జగపతి బాబు మాట్లాడుతూ..
''తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంటరై పెద్ద నిర్మాతగా ఎదగాలని, కుమారుడ్ని పెద్ద హీరో చేయాలనే తపన కుమారస్వామి గారిలో కనబడుతోంది. ఓ సందర్భంలో నిఖిల్ గురించి అడిగినపుడు రాష్ట్రం కోసం ఎంతో చేశాను. నా కొడుకు కోసం ఈమాత్రం చేయలేనా అన్నారు. ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేశారు. ఇలాంటి సినిమాలో నేను పార్ట్ కావడాన్ని ప్రివిలేజ్‌గా భావిస్తున్నాను'' అన్నారు.

విజయేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే
విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ - ''మొదటిసారి నన్ను పిలిచి కథ రాయమన్నప్పుడు ఏం రాద్దాంలే అనుకున్నాను. నిఖిల్‌కి సంబంధించిన ఒక వీడియో క్లిప్ చూశాక తనలో స్పార్క్ చూసి తను ఒక డైమండ్ అని అర్ధమైంది. నాపై నమ్మకంతో నిఖిల్‌ను నాకు అప్పగించారు. మహదేవ్ సినిమాని కష్టపడి తెరకెక్కిస్తున్నాడు. ఆల్ ది బెస్ట్'' అన్నారు.

తారాగణం
నిఖిల్‌కుమార్, దీప్తి జంటగా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, రఘుబాబు, బ్రహ్మానందం, సంపత్, ఆదిత్యమీనన్, భజ్రంగ్ లోకేష్, అవినాష్, వినాయక్ జోషి, ప్రశాంత్, సుప్రీత్ రెడ్డి, రావు రమేష్, రమ్యకృష్ణ తదితరులు నటించిన

తెర వెనక
ఈ చిత్రానికి సమర్పణ: హెచ్.డి. కుమారస్వామి, కథ: విజయేంద్ర ప్రసాద్, సినిమాటోగ్రఫి: మనోజ్ పరమహంస, మ్యూజిక్: యస్.యస్. థమన్, ఆర్ట్: నారాయణరెడ్డి, సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి, ఫైట్స్: రవివర్మ, రామ్-లక్ష్మణ్, కలోయాన్ (బల్గేరియా), సెల్వ, కో డైరెక్టర్: అమ్మినేని మాధవసాయి, నిర్మాత: శ్రీమతి అనితా కుమారస్వామి, స్క్రీన్‌ప్లే - మాటలు - దర్శకత్వం: ఎ. మహదేవ్.