»   » పవన్ కల్యాణ్ ఫోన్ చేసి, హెల్మెట్ కొన్నావా అని అడిగారు !

పవన్ కల్యాణ్ ఫోన్ చేసి, హెల్మెట్ కొన్నావా అని అడిగారు !

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : "నా విషయంలో మావయ్యలు చాలా కేరింగ్‌గా ఉంటారు. కల్యాణ్ మావయ్య తీసుకునే కేర్ గురించి ఓ ఎగ్జాంపుల్ చెప్పాలంటే.. నాకు బాగా డబ్బులు సంపాదించి బైక్ కొనాలని ఎప్పట్నుంచో ఆశ. ఈ మధ్యే హార్లీ డేవిడ్‌సన్ బైక్ కొన్నాను. ఆ విషయం తెలుసుకుని కల్యాణ్ మావయ్య ఫోన్ చేసి 'హెల్మెట్ కొనుకున్నావా, గ్లౌజులు కొనుక్కున్నావా' అని అడిగారు. అంత కేరింగ్‌గా ఉంటారు" అంటున్నారు సాయి ధరమ్ తేజ.

pawan

సాయి ధరమ్ తేజ తాజా సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్'. ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత. సాయిధరమ్‌ తేజ్‌ సరసన రెజీనా, ఆదాశర్మ నటిస్తున్నారు. ఈనెల 24న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

చిత్రం లో తన పాత్ర గురించి చెప్తూ...చిన్నప్పటి నుంచి డబ్బు సంపాదించాలని తపించే పాత్రను ఈ సినిమాలో చేశాను. అందుకే అమెరికా వెళ్లి రెస్టారెంట్‌లో వెయిటర్‌లా, టాక్సీ డ్రైవర్‌గా.. డబ్బు కోసం ఇలా చాలా ఉద్యోగాలు చేస్తుంటాను. ఆ టైంలోనే హీరోయిన్‌కు సంబంధించిన ఓ సమస్యను సాల్వ్ చేస్తాను. ఈ క్రమంలోనే తనతో ప్రేమలో పడి, దాన్ని పెళ్లి దాకా ఎలా తీసుకెళ్లాననే ది మిగతా కథ.

subrahmanyam2

చిరంజీవి సాంగ్ రీమిక్స్ గురించి చెప్తూ... ఈ సినిమాలో చిరంజీవి మావయ్య హిట్ సాంగ్ 'గువ్వా గోరింకతో...' పాటను రీమిక్స్ చేయాలన్నది హరీశ్, 'దిల్' రాజుగార్ల చాయిస్. ఆ సాంగ్ వేల్యూ చెడగొట్టకుండా చిత్రీకరించాం. ఏదో ఎట్రాక్ట్ చేయాలి అన్నట్టుగా ఈ పాట తీయలేదు. ఆయన సినిమాలను ఎలాగో రీమేక్ చేయలేం.

అందుకే కనీసం పాటనైనా రీమేక్ చేయాలన్న ఉద్దేశంతో రీమేక్ చేశాం. ఈ పాటను అమెరికాలోని గ్రాండ్ కేనియన్‌లో చిత్రీకరించాం. అక్కడ తొలిసారిగా షూటింగ్ జరుపుకున్న సినిమా ఇదే. ఉదయం 5 నుంచి 7 గంటల వరకు మాత్రమే షూటింగ్‌కు పర్మిషన్ ఇచ్చారు. రాత్రి 12 గంటల వరకు రిహార్సల్స్ చేసి, తెల్లవారుజామున మూడు గంటలకు అక్కడికి బయలుదేరి కేవలం రెండు గంటల్లో పల్లవి, చరణం షూట్ చేశాం అన్నారు.

subrhmanyam1

సాయిధరమ్‌తేజ్‌. సుమన్‌, కోట శ్రీనివాసరావు, నాగబాబు, రావు రమేశ్‌, పృథ్వీ, ప్రభాస్‌ శ్రీను తదితరులు నటించే ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే. మేయర్‌, ఫొటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, స్ర్కీన్‌ప్లే: రమేశ్‌రెడ్డి, సతీశ్‌ వేగేశ్న, తోట ప్రసాద్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌, నిర్మాత: దిల్‌ రాజు, కథ, మాటలు, దర్శకత్వం: హరీశ్‌శంకర్‌ ఎస్‌

English summary
Sai Dharma Teja said that pawan Kalyan asked him about Helmet. His latest Subramanyam For Sale Grand Release on September 24th . The movie featuring Sai Dharam Tej, Regina Cassandra, Adah Sharma. Produced by Dil Raju under the banner Sri Venkateswara Creations. Directed by Harish Shankar and music composed by Mickey J Meyer. Subramanyam For Sale also stars Rao Ramesh, Naga Babu, Kota Srinivasa Rao among others.
Please Wait while comments are loading...