»   » ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగులో పవన్ కళ్యాణ్ (ఫోటోస్)

‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగులో పవన్ కళ్యాణ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగులో భాగంగా ప్రస్తుతం గుజరాత్ లో ఉన్నారు. గుజరాత్ లోని వడోదరాలో పవన్ కళ్యాణ్ షూటింగులో పాల్గొన్న దృశ్యాలు కొన్ని బయటకు వచ్చాయి. చుట్టూ సెక్యూరిటీ గార్డులతో పవన్ కళ్యాణ్ ఫోటోల్లో కనిపిస్తున్నారు. అత్తారింటికి దారేది సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ ఇదే తరహాలో చుట్టూ సెక్యూరిటీ గార్డులతో కనిపిస్తారు. దీంతో ఆఫ్ స్క్రీన్ అయినా, ఆన్ స్క్రీన్ అయినా పవన్ కళ్యాణ్ లైఫ్ ఒకేలా ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు చేస్తున్నారు.

Pawan Kalyan at Sardaar Gabbar Singh Shoot

‘సర్దార్ గబ్బర్‌సింగ్' అన్ని అనుకున్నట్లు జరిగితే సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో సమ్మర్‌లో విడుదల చేయబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సమ్మర్ కంటే ఓ నెల ముందే విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం.


Pawan Kalyan at Sardaar Gabbar Singh Shoot

గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే సర్దార్ గబ్బర్ సింగ్‌ను నెలరోజుల ముందుగా విడుదల చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో రంగంలోకి దిగే ఆలోచనలో పవన్ ఉన్నాడని.. అందుకే అభిమానులను నిరాశ పరచకూడదనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్‌ను వీలయినంత త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటున్నాడట.


Pawan Kalyan at Sardaar Gabbar Singh Shoot

సర్దార్ గబ్బర్ సింగ్ ఈ సినిమాలో తొలిసారిగా కాజల్ అగర్వాల్ పవన్ కళ్యాణ్ తో జోడీ కడుతోంది. రాయ్ లక్ష్మీ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రతో పాటు స్పెషల్ సాంగుతో ప్రేక్షకులను అలరించనుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

English summary
Powerstar Pawan Kalyan is riding high in Gujarat now. He's been to Vadodara to take part in the shooting of his film "Sardaar Gabbar Singh" that is being canned there.
Please Wait while comments are loading...