»   » పర్సనల్ డిజైనర్ పెళ్లి వేడుకలో పవన్ కళ్యాణ్ (ఫోటోస్)

పర్సనల్ డిజైనర్ పెళ్లి వేడుకలో పవన్ కళ్యాణ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ పూర్తి కావడంతో ఫ్రీ అయ్యారు. నిన్న మొన్నటి వరకు సినిమా షూటింగులో బిజీగా గడిపిన ఆయన అన్నయ్య కూతురు శ్రీజ వివాహానికి కూడా హాజరు కాలేక పోయారు. ఇపుడు సినిమా పనులు ముగియడంతో తన పర్సనల్ కాస్టూమ్ డిజైనర్ రాజేష్ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ అయ్యాయి.

సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడటం, షూటింగ్ ఇంకా పెండింగులో ఉండటంతో అన్నయ్య చిరంజీవి అనుమతి తీసుకుని మరీ శ్రీజ వివాహానికి డుమ్మాకొట్టారు. పవన్ గైర్హాజరైనా తన మూడో భార్య అన్నా లెజెనివాను శ్రీజ పెళ్లి వేడుకకు పంపడం ద్వారా తాను లేని లోటును ఎంతో కొంత పూడ్చే ప్రయత్నం చేసారు.

షూటింగ్ పూర్తయి హైదరాబాద్ వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ నేరుగా వెళ్లి అన్నయ్య చిరంజీవితో పాటు శ్రీజ-కళ్యాణ్ దంపతులను కలిసారు. వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేసారు.

స్లైడ్ షోలో పవన్ కళ్యాణ్ తన పర్సనల్ కాస్టూమ్ డిజైనర్ పెళ్లి వేడుకకు హాజరైన ఫోటోస్...

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ తన పర్సనల్ కాస్టూమ్ డిజైనర్ రాజేష్ వెడ్డింగ్ కు హాజరయ్యారు.

షూటింగ్ అనంతరం..

షూటింగ్ అనంతరం..

సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ ముగియడంతో మార్చిన 1న జరిగిన రాజేష్ పెళ్లి వేడుకకు పవన్ హాజరయ్యారు.

శ్రీజ వివాహానికి డుమ్మా

శ్రీజ వివాహానికి డుమ్మా

షూటింగులో బిజీగా ఉండటంతో అన్నయ్య చిరంజీవి కూతురు శ్రీజ వివాహానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేక పోయారు.

రాజేష్

రాజేష్

కాస్టూమ్ డిజైనర్ రాజేష్ పవన్ కళ్యాణ్ సన్నిహితుల్లో ఒకరు.

పవన్ మూడో భార్య

పవన్ మూడో భార్య

శ్రీజ వివాహానికి తాను హాజరు కాలేక పోయినా తన భార్య అన్నా లెజెనివాను పంపించారు పవన్.

English summary
Pawan Kalyan attend his personal costume designer Rajesh More’s wedding on March 1.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu