»   » పవన్ కళ్యాణ్ పాత్ర 25...క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

పవన్ కళ్యాణ్ పాత్ర 25...క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్లో 'గోపాలా గోపాలా' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హిందీలో సూపర్ హిట్ అయిన 'ఓ మై గాడ్' చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. హిందీ వెర్షన్లో అక్షయ్ కుమార్, పరేష్ రావల్ నటించారు.

తాజాగా 'గోపాలా గోపాలా' చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. జులై 21న పవన్ కళ్యాణ్‌ షూటింగులో జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా దర్శకుడు కిషోర్ (డాలీ) మాట్లాడుతూ.....స్వతహాగా నేను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని. ఆయన నటించే సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం రావడం ఎంతో గొప్పగా భావిస్తున్నాను అన్నారు.

'సోమవారం నుండి పవన్ కళ్యాణ్‌పై చిత్రీకరణ ప్రారంభమైంది. సినిమాలో ఆయన పాత్ర 25 నిమిషాలు ఉంటుంది. హిందీలో అక్షయ్ కుమార్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. పరేష్ రావల్ నటించిన పాత్రను వెంకటేష్ చేస్తున్నారు అని దర్శకుడు డాలీ చెప్పుకొచ్చారు.

Pawan Kalyan to be seen for 25 minutes in 'Gopala Gopala'

గోపాలా గోపాలా చిత్రంలో పవన్ కళ్యాణ్, వెంకటేష్ మధ్య చోటు చేసుకునే సన్నివేశాలు, డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయని దర్శకుడు తెలిపారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని 'సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

శ్రీయ, మిథున్ చక్రవర్తి, మురళి శర్మలు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియ, ఉమేష్ శుక్ల, స్క్రీన్ ప్లే: కిషోర్ కుమార్ పార్ధసాని, భూపతి రాజా, దీపక్ రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు : సాయి మాధవ్, సంగీతం : అనూప్ రూబెన్స్, పాటలు : చంద్ర బోస్, ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, కొరియో గ్రఫీ : సుచిత్ర చంద్రబోస్, కో డైరెక్టర్స్ : పూసల రాధాకృష్ణ, వై.శ్రీనివాస రెడ్డి, ప్రొడక్షన్ ఎగ్జి క్యుటివ్స్ : వీరేన్ తంబి దొరై, భాస్కర రాజు, అభిరామ్, దర్శకత్వం: డాలి.

English summary
Actor Pawan Kalyan, who plays Lord Krishna in the Telugu remake of ‘OMG: Oh My God’ titled ‘Gopala Gopala’, will be seen for 25 minutes in the film. He started shooting for the film here Monday.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu