twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గడ్డం తీయలేదు...మరి గబ్బర్ సింగ్-2 సంగతేంటి?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘గబ్బర్ సింగ్ 2' ప్రాజెక్టు ఎట్టకేలకు మే 29న ప్రారంభం కాబోతోందని అంతా అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గడ్డం గీసుకుని సినిమాకు రెడీ అవుతున్నట్లు వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. కానీ మంచు మనోజ్ పెళ్లిలో పవన్ కళ్యాణ్ గడ్డం లుక్ చూసి కొత్త అనుమానాలు మొదలయ్యాయి.

    పవన్‌ కళ్యాణ్ వ్యవహార శైలి చూస్తుంటే....ఆయన గబ్బర్ సింగ్-2 షూటింగు మొదలు పెట్టడం కంటే రైతుల తరఫున పోరాటానికి వెళ్లబోతున్న తెలుస్తోంది. తాజా గడ్డం లుక్ ఈ వాదనకు మరింత బాలాన్ని ఇచ్చింది. త్వరలో ఆయన రాజధానిలో భూముల సేకరన విషయంలో ఏపీ రైతుల తరుపున దీక్ష చేపట్టబోతున్నట్లు, అందుకే ఈ గెడ్డం పెంచుతున్నట్లు చర్చించుకుంటున్నారు.

    గబ్బర్ సింగ్ -2 చిత్రానికి కెఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తారు. పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ శరత్ మరార్ నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిషా అంబ్రోస్ లీడ్ హీరోయిన్. మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ చెన్నైలో ప్రారంభం అయ్యాయి.

    ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలెట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాలకు దేవిశ్రీ ప్రసాద్ సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కూడా అతనే కావడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

    Pawan Kalyan beard look at Manoj

    కథరీత్యా మరో హీరోయిన్ కూ చోటుందని సమాచారం. ఆ హీరోయిన్ మరెవరో కాదు...త్రిష అని తెలుస్తోంది. ఈ మేరకు ఆమెను సంప్రదించారని చెప్పుకుంటున్నారు. అయితే కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని యూనిట్ అభిప్రాయపడుతోందని మరో ప్రక్క వార్తలు వినపడుతున్నాయి. ఈ విషయమై ప్రొడక్షన్ టీమ్ కామెంట్ చేయటానికి ఇష్టపడటం లేదు. త్వరలోనే ఆ హీరోయిన్ ఎవరనేది తేల్చి అఫీషియల్ గా మీడియాకు స్టేట్ మెంట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

    ఈ చిత్రం గబ్బర్‌సింగ్‌కు సీక్వెల్ కాదని, ప్రేమ, వినోదం, యాక్షన్ అంశాలు సమపాళ్లలో మేళవించిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. ప్రస్తుతం బ్రహ్మానందం, ఆలీ, నర్రా శ్రీనులను తారాగణంగా ఎంచుకున్నారు. హిందీ చిత్ర పరిశ్రమ నుంచి మరికొంత మందిని తీసుకుంటారని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: దేవీశ్రీప్రసాద్, కెమెరా: జైనన్ విన్సెంట్, ఆర్ట్: ఆనంద్‌సాయి, కాస్ట్యూమ్స్ భానూమోరే, క్రియేటివ్ హెడ్: హరీశ్‌పాయ్.

    English summary
    Pawan Kalyan's mere presence at the Wedding Ceremony of Manchu Manchu has put an end to the rumours. The Actor-turned-Politician sported a bushy beard look as he arrived at the venue where Vishnu and Mohan Babu gave a warm welcome.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X