For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆపండి రూమర్స్ అంటూ పవన్, , రీమేక్ నే నమ్మి, రిలీజ్ కూడా ఫిక్స్, ఈలోగా బెంగుళూరుకి

  By Srikanya
  |

  హైదరాబాద్‌: పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడుపై రకరకాల రూమర్స్ ఈ మధ్యకాలంలో మొదలయ్యాయి. సినిమా ఆగిపోయిందంటూ కొందరు, లేదు డైరక్టర్ ని మళ్లీ మారుస్తున్నాడంటూ మరికొందురు, స్క్రిప్టు నచ్చలేదని కొంతమంది, పవన్ కు అసలు ఈ ప్రాజెక్టు మీద ఇంట్రస్టే లేదని ..ఇలా కంటిన్యూగా ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది. అయితే ఆ రూమర్స్ కు చెక్ చెప్పటానకి పవన్ సిద్దమయ్యారు.

  పవన్‌కల్యాణ్‌ చిత్రమంటే కేవలం ఫ్యాన్స్ కు మాత్రమే కాదు.. తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఆసక్తిగా గమనిస్తూ ఉంటుంది. సినిమా ప్రారంభమైన దగ్గరి నుంచి విడుదలయ్యే వరకు ఆయన సినిమాకు సంబంధించిన ప్రతీ అంశం ఆసక్తిని కలిగిస్తూ, ఆ వార్తలు ఉత్సుకతను కలిగిస్తూంటాయి. ఇక అభిమానుల సంగతి వేరే చెప్పనక్కర్లేదు.

  జల్సా, పులి, పంజా, గబ్బర్‌సింగ్‌, సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ఇలా ఆయన సినిమా టైటిళ్లు కూడా మాస్‌ను మెప్పించేలా ఉంటాయి. ఇప్పుడు తాజాగా 'కాటమరాయుడు'గా పవన్‌కల్యాణ్‌ రాబోతున్నారు. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 'కా టమరాయుడా... కదిరి నరసింహుడా...' అంటూ 'అత్తారింటికి దారేది'లో ఆడి పాడాడు పవన్‌కల్యాణ్‌. ఈ పాట ఇప్పుడు మరోసారి గుర్తు చేస్తున్నాడు.

  గోపాల గోపాల' దర్శకుడు కిశోర్‌కుమార్‌ పార్దసాని(డాలీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యాక్షనిస్టు ప్రేమకథతో తెరకెక్కించనున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఆకుల శివ ఈ చిత్రానికి కథను అందించారు.అన్నట్లు 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవన్‌కల్యాణ్‌ 'కాటమరాయుడా కదిరి నరసింహుడా..' అంటూ పాట పాడిన సంగతి తెలిసిందే.

  ఏపీ కి ప్రత్యేక హోదా పై తిరుపతి, కాకినాడ సభల్లో గళమెత్తి గర్జన ప్రకటనలు చేసిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..మళ్ళీ కాటమరాయుడే అవుతున్నాడు. రియల్ లైఫ్ నుంచి తిరిగి రీల్ లైఫ్ లోకి ఎంటర్ అవుతున్నాడు. కాటమరాయుడు సినిమాకోసం వారం పాటు ఫిట్ నెస్ సంతరించుకునేందుకు బెంగుళూరు వెళ్లేందుకు రెడీ అయ్యాడని సమాచారం.

  స్లైడ్ షోలో చిత్రానికి సంభందించిన లేటెస్ట్ అప్ డేట్స్ ...

   రాజకీయాల్లో బిజీగా ఉన్నా పవన్ ..

  రాజకీయాల్లో బిజీగా ఉన్నా పవన్ ..

  పవన్‌ కల్యాణ్‌ త్వరలోనే ‘కాటమరాయుడు'గా తెరపైకి రానున్నాడు. ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' తరవాత పవన్‌ చేస్తున్న చిత్రమిది. మొన్నామధ్యే లాంఛనంగా మొదలైంది. పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల ‘కాటమరాయుడు'పై దృష్టి పెట్టే సమయం రాలేదు. ఇప్పుడు పవన్‌ ‘కాటమరాయుడు' సెట్లో అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ - శ్రుతిహాసన్ లతో పాటు కీలక పాత్రధారులందరూ ఈ షెడ్యూల్లో షూటింగుకి హాజరవుతారట.

   24 నుంచే పవన్ మొదలెడుతున్నాడు

  24 నుంచే పవన్ మొదలెడుతున్నాడు

  ఈ నెల 20న ‘కాటమరాయుడు' రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవ్వనుంది. 24 నుంచి పవన్‌ కల్యాణ్‌ షూటింగ్ లో పాల్గొంటాడని సమాచారం. అక్కడ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపనున్నారు. ఈ విషయమై ఇప్పటికే కసరత్తు మొదలైపోయింది. పవన్ ఈ చిత్రం పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తోంది. కథ ఆయనకు బాగా నచ్చిందని చెప్పుకుంటున్నారు.

   కాటమరాయుడు రిలీజ్ ఎప్పుడు

  కాటమరాయుడు రిలీజ్ ఎప్పుడు

  2017 ప్రథమార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. పిభ్రవరి చివరి వారంలోకానీ మార్చి మొదటి వారంలో కానీ ఉండవచ్చని సమాచారం. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై శరత్‌ మరార్‌ నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యాక్షన్‌ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది.

   రాయలసీమలో ఫేమస్ అనే..

  రాయలసీమలో ఫేమస్ అనే..

  ఈ చిత్రానికి కాటమరాయుడు అనే టైటిల్ ఫిక్స్ చేయటానికి కారణాలు చాలా ఉన్నాయట. ముఖ్యంగా ఇది ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ప్రేమ కథ కావటం. రాయలసీమ ప్రాంతం చుట్టూ తిరిగే కథ. రాయలసీమలో కాటమరాయుడు భలే ఫ్యామస్‌. అందుకే ఈ టైటిల్ ఫిక్స్ చేశారని చెప్తున్నారు. ఈ సినిమా కోసం కడప కింగ్ అనే పేరూ అనుకొన్నారు. కానీ కడప కింగ్ అంటే ఓ ప్రాంతానికి సంబంధించిన టైటిల్‌గా మిగిలిపోతుందని, కాటమరాయుడు అంటే రాయలసీమ మొత్తానికీ రిప్రజెంట్ చేయొచ్చని పవన్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట.

   టూర్ ఫొటోనే ఫస్ట్ లుక్ గా

  టూర్ ఫొటోనే ఫస్ట్ లుక్ గా

  పవన్‌కల్యాణ్ బర్త్ డే సందర్భంగా కాటమరాయుడు ఫస్ట్‌లుక్ వచ్చేసి హంగామా చేసిన సంగతి తెలిసిందే. ఈ లుక్‌లో పవర్‌స్టార్ సూపర్బ్‌గా వుందంటూ నెట్టింట్లో ఒకటే హంగామా! ఆయన లుక్ గురించే స్పెషల్‌గా మాట్లాడుకుంటున్నారు. కాటమరాయుడు షూట్‌కి పవన్ ఇంకా అటెండ్ కాలేదు.. అలాంటప్పుడు ఆ లుక్ ఎలా వచ్చింది? బర్త్ డే కోసం స్పెషల్‌గా ఫోటో సెషన్ చేసే అలవాటు పవన్‌కి ఏ మాత్రం లేదన్నది అందరికీ తెలిసిందే. ఫోటో కోసం పవన్ చుట్టూ నాలుగైదు రోజులు ప్రొడ్యూసర్ తిరిగాడట. ఇక టైమ్ దగ్గరపడడంతో పవన్ లండన్ టూర్ వెళ్లి వచ్చిన ఫోటోల్లో ఒకటి తీసుకుని 'కాటమరాయుడు' పోస్టర్ వేసారు.

  డాలీకు డెడ్ లైన్ ఇచ్చిన పవన్

  డాలీకు డెడ్ లైన్ ఇచ్చిన పవన్

  దాదాపు గత వారం రోజులుగా ఏపీ రాజకీయాల్లో 'జనసేన' అధినేత పవన్ కళ్యాణ్ క్రియాశీలకంగా మారారు. పవన్ కూడా తన కార్యాచరణ తనకుందని, ఈ ఏడాది చివరి వరకు ప్రభుత్వాలకు సమయం ఇస్తూ సైలెంట్ అయ్యారు. ఇక, పవన్ దృష్టి అంతా తన తదుపరి సినిమాపైన పెట్టబోతున్నారు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న "కాటమరాయుడు" సినిమాను ఎట్టి పరిస్థితులలో డిసెంబర్ నాటికల్లా ముగించాలని పవన్ కళ్యాణ్ డెడ్ లైన్ విధించినట్లుగా తెలుస్తోంది.

  మళ్లీ బెంగుళూరు వెళ్ళి ఫిటెనెస్ కోసం కసరత్తులు

  మళ్లీ బెంగుళూరు వెళ్ళి ఫిటెనెస్ కోసం కసరత్తులు

  ఈ సినిమాలో లుక్ కోసం, ఫిట్ నెస్ రీత్యా బెంగుళూరులో వారం రోజుల పాటు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు సైతం పవన్ ఇలాగే బెంగుళూరులోని ఓ జిమ్ లో కసరత్తులు చేసి, షూటింగ్ లో పాల్గొన్నారు. కొన్ని విషయాల్లో పవన్ చాలా చాలా ఖచ్చితంగా ఉంటారు. ముఖ్యంగా తమ ఫిటెనెస్ విషయంలో. అందుకే షూటింగ్ కు ముందు వారం పాటు నిపుణుల పర్యవేక్షణలో గడపనున్నారని తెలుస్తోంది.

   అజిత్ చిత్రం రీమేకే కాటమరాయుడు

  అజిత్ చిత్రం రీమేకే కాటమరాయుడు

  కాటమరాయుడు చిత్రం అజిత్ హీరోగా వచ్చి హిట్టైన 'వీరం' రీమేక్ అని సమాచారం..'వీరం' అంటే తమిళ్ లో అజిత్ , తమన్నా జంటగా నటించిన చిత్రం..ఆ మద్య ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ చూడడం జరిగిందట..అది పవన్ కు బాగా నచ్చిందట, కామెడీ , యాక్షన్, సెంటిమెంట్ అన్నీ కూడా కరెక్ట్ గా ఉండటంతో ఈ సినిమా పవన్ కు బాగా నచ్చిందట. అంతే కాదు ఈ చిత్రాన్ని తెలుగు లో రీమేక్ చేస్తే సూపర్ హిట్ అవుతుందని అనుకున్నాడట. ఈ లోపు సర్దార్ సెట్స్ ఫైకి వెళ్ళడం తో ఈ చిత్రాన్ని పక్కకు పెట్టాడట.. ఇప్పుడు సర్దార్ షూటింగ్ పూర్తి కావోస్తుండడం తో మళ్లీ పవన్ 'వీరం' ఫై కన్నేసి, ఇలా కాటమరాయుడుగా తెస్తున్నారట.

   ధియోటర్స్ లో రిలీజ్ కాలేదు కానీ..

  ధియోటర్స్ లో రిలీజ్ కాలేదు కానీ..

  అయితే వీరం సినిమాను ఆల్రెడీ డబ్ చేసి వీరుడొక్కడే పేరుతో విడుదల చేసారు. దాంతో మళ్లీ ఇక్కడ అదే సినిమాను అధికారికంగా అయినా అనధికారికంగా అయినా ఎందుకు రీమేక్ చేస్తారనేదే ప్రశ్న. కానీ ఇక్కడ ధియోటర్స్ లో ఈ చిత్రం రిలీజ్ కాలేదు. కేవలం యూట్యూబ్ లో మాత్రమే వీరం చిత్రం వీరుడొక్కడే దొరుకుతోంది. దాంతో ఇలా ధైర్యం చేస్తున్నట్లు చెప్తున్నారు.

   రీమేక్ లతోనే కలిసొస్తోంది

  రీమేక్ లతోనే కలిసొస్తోంది

  పవన్ కు తొలి చిత్రం నుంచి రీమేక్ లే అని చెప్పాలి. అలాగే ఆయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ లుగా చెప్పుకోదగ్గ ఖుషి, తమ్ముడు, గోకులంలో సీత, గబ్బర్ సింగ్ వంటి సినిమాలన్నీ రీమేక్ లే. దాంతో ఆయన రీమేక్ నే మళ్లీ నమ్ముకున్నాడంటున్నారు. ముఖ్యంగా తన వయస్సుకు తగ్గ పాత్ర అనే పవన్ ఈ రీమేక్ పై ఆసక్తి చూపుతున్నట్లు చెప్తున్నారు.

   సర్దార్ నష్టాలను ఈ సినిమాతో ..

  సర్దార్ నష్టాలను ఈ సినిమాతో ..

  ప్లాప్ బస్టర్ గా నిలిచిన 'సర్దార్ గబ్బర్ సింగ్' నష్టాలను పూరించేందుకు తన నెక్ట్స్ సినిమా శరత్ మరార్ కే ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమాతో డిస్టిబ్యూటర్లకు.. ఆడియన్స్ కు న్యాయం చేయాలన్నది పవన్ ప్లాన్ గా చెప్పుకుంటున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ బయ్యర్లకు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా దీనిద్వారా చెల్లిస్తారన్న ఆలోచన కూడా ఉందట.

   సప్తగిరికా..పవన్ కళ్యాణ్ కా

  సప్తగిరికా..పవన్ కళ్యాణ్ కా

  ఇక కాటరాయుడా టైటిల్ తో సప్తగిరి హీరోగా ఓ చిత్రం షూటింగ్ ఆల్రెడీ పూర్తై,రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఓ తమిళ చిత్రం రీమేక్ గా ఆ చిత్రం తెరకెక్కిందని సమాచారం. అయితే ఎప్పుడైతే కాటమరాయుడా టైటిల్ తో పవన్ ముందుకు వెళ్దామనుకున్నారో..అప్పుడు ఎంక్వైరీ చేస్తే ఆ టైటిల్ వేరే వారి పేరుపై రిజిస్టర్ అయ్యి ఉందని తెలుసుకుని, వెంటనే ఆ నిర్మాతతో సెటిల్ చేసుకున్నారని సమాచారం.

   త్రివిక్రమ్ తో మళ్లీ పవన్ ఎప్పుడంటే...

  త్రివిక్రమ్ తో మళ్లీ పవన్ ఎప్పుడంటే...

  'కాటమరాయుడు' తరవాత పవన్‌ నటించబోయే చిత్రాలేంటన్న విషయం ఒకొక్కటిగా కొలిక్కి వస్తున్నాయి. 'కాటమరాయుడు' పూర్తవ్వగానే త్రివిక్రమ్‌తో కలసి ఓ సినిమా చేయబోతున్నాడు పవన్‌. అయితే ఆ చిత్రం ఎప్పిటినుంచో అనుకుంటున్న కోబలి చిత్రమా లేక మరొకటా అనేది తెలియరాలేదు. కానీ ఖచ్చితంగా త్రివిక్రమ్ తో చిత్రం ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి.

   వేదాలం రీమేక్ గురించి

  వేదాలం రీమేక్ గురించి

  ప్రముఖ తమిళ నిర్మాత ,తనకు ఖుషీ వంటి హిట్ ఇచ్చిన ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం నిర్మాతగా మరో చిత్రం కూడా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ మేరకు రత్నంతో చర్చలు జరిగి, ఓ కొలిక్కి వచ్చచాయని సమాచారం. ఈ చిత్రం కూడా అజిత్ హీరోగా వచ్చిన వేదాలం రీమేక్ అని తెలుస్తోంది. వేదాలం చిత్రం అజిత్ కెరీర్ లో మంచి హిట్ గా నమోదైంది.

   దాసరి నిర్మాతగా డైరక్టర్ ఎవరంటే

  దాసరి నిర్మాతగా డైరక్టర్ ఎవరంటే

  ప్రముఖ దర్సకుడు దాసరి నారాయణరావు నిర్మాతగా పవన్ హీరోగా ఓ చిత్రం ఖరారైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుందనే విషయమై క్లారిటీ లేదు. ఖచ్చితంగా చిత్రం అయితే దాసరి నిర్మాణంలో ఉంటుందంటున్నారు. త్రివిక్రమ్ దర్సకత్వం చేసే చిత్రానికి దాసరి నిర్మాతగా ఉండబోతున్నారనే ప్రచారం సైతం జరిగింది.

   గబ్బర్ సింగ్ డైరక్టర్ తో మళ్లీ

  గబ్బర్ సింగ్ డైరక్టర్ తో మళ్లీ

  తనకు గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ తో పవన్ మరో చిత్రం చేసే అవకాసం ఉందని సమాచారం. అయితే అది వేదాళం రీమేక్ అని ఓ ప్రక్కన ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే పవన్ ని హరీష్ కలిసి ఓ కథని నేరేట్ చేసాడంటున్నారు. అలాగే దిల్ రాజు నిర్మాతగా ఈ ప్రాజెక్టు తెరకెక్కే అవకాసం ఉందంటున్నారు.

  English summary
  Pawan Kalyan will be beginning the regular shoot of his current film 'Katamarayudu' on the 24th of this month. Though the movie begins its shoot schedule from 20th of this month itself, Pawan Kalyan will join the unit four days later.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X