twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా అక్కను ఈడ్చుకెళ్ళారు:పవన్

    By Staff
    |

    Pawan Kalyan
    'నేను ఏడోతరగతి చదువుతున్నప్పుడు మాఅక్కను ఇద్దరు వ్యక్తులు ఈడ్చుకెళితే జనం మొదట చోద్యం చూశారు. తర్వాత రక్షించారు. వాళ్లను ముక్కలు ముక్కలుగా నరకాలనుకున్నా.. మానాన్న వారిపై చర్యలు తీసుకునేలా చేయడంతో మానుకున్నా' అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ప్రజారాజ్యం యువజన సదస్సులో ఆయన చాలా ఆవేదనగా మాట్లాడారు. అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నా మనకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నాం. దీనికి కారణం.. మనలో సున్నితత్వం చచ్చిపోవడమే అని ఆయన పేర్కొన్నారు.

    'స్వప్నికతో మాట్లాడితే అంత బాధలోనూ.. తన పరిస్థితి ఎవరికీ రాకూడదని కోరింది. ఆమె తొలిసారి ఫిర్యాదు చేసినప్పుడే పోలీసులు, అధికారులు స్పందించి ఉంటే ఇప్పుడు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాల్సి వచ్చేది కాదు. శ్రీలక్ష్మి, గంగాభవాని, స్వప్నిక.. ఇలా బాధితులు పెరిగేవారు కాదు. చనిపోవడం ఎలాగూ తప్పదు. సమస్యలపై పోరాడి చనిపోతే గుర్తింపన్నా వస్తుంది. అందుకే అడవుల్లోకి వెళ్లడం కన్నా జనారణ్యంలో ఉండి పోరాడాలని అనుకున్నా'' అని పవన్‌ కళ్యాణ్‌ ఉద్వేగంగా పేర్కొన్నారు.''సొంత ప్రయోజనాలు, వారసులు, కుటుంబాలు, అనుయాయుల కోసం వందలు, వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.. ఎందుకు? ఆరు అడుగుల గోతిలో పడి చచ్చేందుకా?'' అని ఆవేశంగా ప్రశ్నించారు.

    ఇక ఈవ్‌ టీజింగ్‌, ర్యాగింగ్‌ నిర్మూలనకు యువరాజ్యం కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి నగరం, పట్టణం, తాలూకా కేంద్రాల్లో ఫోరంలు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రముఖులు ఇందులో సభ్యులుగా ఉంటారన్నారు. న్యాయపరమైన చర్యలపై చర్చించేందుకు న్యాయనిపుణులతో కూడిన మరో ఫోరాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. వేక్ అప్ ఇండియా అనే పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఇందులో పాలుపంచుకోవాలని కోరారు. వైబ్‌సైట్‌కు వచ్చే అభిప్రాయాలను విశ్లేషించి తగిన ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఇప్పటికే తాము రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది సభ్యులతో అంతర్గత వ్యవస్థను నిర్మించామని చెప్పారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X