»   »  ‘సర్దార్’ బాధితులకు పవన్ కళ్యాణ్ ఎంత ఇస్తున్నారో తెలుసా?

‘సర్దార్’ బాధితులకు పవన్ కళ్యాణ్ ఎంత ఇస్తున్నారో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా అంటేనే వ్యాపారం...వ్యాపారం అంటే నష్టాలు, లాభాలు. కొన్ని సార్లు లాభాలు, మరిన్ని కొన్ని సార్లు నష్టాలు తప్పవు. సినిమా హిట్టయితే తమ వల్లే అని గొప్పలు పోయే హీరోలు ఎందరో...అదే సినిమా ఆడిక పోతే దర్శకుడి మీదనో, మరొకరి మీదనో నెపం నెట్టేసారు. అయితే అందరూ ఇలాంటి వారే కాదు... కొందరు మంచి మనసున్న స్టార్స్ కూడా ఉన్నారు ఇండస్ట్రీలో... అందులో ప్రముఖంగా చెప్పుకోవచ్చు.

పవన్ కళ్యాణ్ స్వయంగా కథ సమకూర్చి, స్క్రీన్ ప్లే కూడా అందించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' బాక్సాఫీసు వద్ద అంచనాలను అందుకోలేక పోయింది. సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కొన్ని ప్రాంతాల్లో కొంత మేర నష్టపోయారు. పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో సినిమాను భారీ ధరకు కొనుగోలు చేసారు. తనపై నమ్మకంతో సినిమాను కొనుగోలు చేసి నష్టపోయిన పవన్ కళ్యాణ్ మంచి మనసుతో వారిని ఆదుకోవాలని నిర్ణయించుకున్నారట.

Pawan Kalyan to compensate distributors for Sardaar losses

నష్టపోయిన పంపిణీదారులందరినీ ఆదుకుంటానని, థర్డ్ పార్టీ బయ్యర్లను కూడా ఆదుకుంటానని తెలిపారట. ప్రస్తుతం తాను ఎస్.జె.సూర్య దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ లో సుమారు పాతిక శాతం పక్కన పెట్టిన దాన్ని సర్దార్ గబ్బర్ సింగ్ వల్ల నష్టపోయిన వారికి సర్దుతానని పవన్ నిర్ణయించుకున్నారట.

ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ రూ. 25 నుండి 30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అంటే 5 నుండి 7 కోట్ల వరకు మొత్తాన్ని నష్టోయిన వారికి చెల్లించేందుకు సిద్దమవుతున్నారన్నమాట. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయంపై సినీ ట్రేడ్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

English summary
Pawan Kalyan decided to compensate distributors for Sardaar losses.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu