»   » ‘నాన్నకు ప్రేమతో’ నిర్మాతపై పవన్ కళ్యాణ్ ఫిర్యాదు!

‘నాన్నకు ప్రేమతో’ నిర్మాతపై పవన్ కళ్యాణ్ ఫిర్యాదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తొలిసారిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)ను సంప్రదించి ఫిర్యాదు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ‘అత్తారింటికి దారేది' సినిమా రెమ్యూనరేషన్ విషయంలో ఏర్పడ్డ వివాదమే ఇందుకు కారణం. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ తనకు ఇవ్వాల్సిన రూ. 2 కోట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని పవన్ కళ్యాణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అత్తారింటికి దారేది సినిమా రెమ్యునరేషన్ విషయంలో బీవీఎస్‌ఎన్ తనకు రెండు కోట్లు ఇవ్వాల్సి ఉందని, నాన్నకు ప్రేమతో సినిమా విడుదల ముందే మిగతా రెమ్యునరేషన్ ఇస్తానని ప్రసాద్ మాట తప్పారని పవన్ కళ్యాణఫ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఫిర్యాదును స్వీకరించిన ‘మా'... దాన్ని నిర్మాతల మండలికి పంపింది.

Pawan Kalyan complaints on Producer BVSN Prasad

‘అత్తారింటికి దారేది' సినిమా విడుదల ముందే బయటకు లీక్ అయిన సంగతి తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తోచక వెంటనే సినిమాను విడుదల చేసారు. ఫలితాలు ఎలా ఉంటాయో? తెలియక పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ నిర్మాతకు అండగా నిలిచారు. తమకు రావాల్సిన రెమ్యూనరేషన్ తర్వాత తీసుకుంటామని పెద్ద మనసు చూపించారు.

తర్వాత సినిమా భారీ విజయం సాధించింది. భారీ లాభాలు తెచ్చి పెట్టింది. డబ్బు విషయంమై బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌ను పవన్ ప్రశ్నించగా నాన్నకు ప్రేమతో సినిమా విడుదల ముందే చెల్లిస్తానని మాట ఇచ్చారట. అయితే నిర్మాత నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేక పోవడంతో పవన్ కళ్యాణ్ ‘మా'లో ఫిర్యాదు చేసారు.

English summary
Tollywood power star Pawan Kalyan Complaints on Producer BVSN Prasad.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu