»   » జనసేన: సినిమాలకు డేట్స్ తగ్గించనున్న పవన్‌కళ్యాణ్

జనసేన: సినిమాలకు డేట్స్ తగ్గించనున్న పవన్‌కళ్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజకీయ ఆరంగేట్రం నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక నుండి యేడాదిలో సినిమాలకు యాభై రోజులు కేటాయించాలని నిర్ణయించుకున్నారట. సాధారణంగా పవన్ సినిమాల కోసం యేడాదిలో వంద రోజులు లేదా అంతకంటె ఎక్కువ కేటాయిస్తారట.

అయితే, గత నెల ఆయన జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం లేకపోయినప్పటికీ.. పార్టీని 2019 ఎన్నికల కోసం సమాయత్తం చేయాల్సిన బాధ్యత పవన్ పైన ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఇక నుండి సినిమాలకు కేటాయించే సమయాన్ని తగ్గించాలని నిర్ణయించుకున్నారట.

Pawan Kalyan to concentrate on Jana Sena

ఇప్పటి వరకు వంద రోజుల వరకు కేటాయించిన పవన్.. ఇక నుండి యేడాదిలో యాభై రోజుల వరకు సినిమాలకు కేటాయించాలనుకుంటున్నారట. అయితే, ఇప్పటికే ఆయన గబ్బర్ సింగ్ 2 చిత్రం ముహూర్తం జరుపుకుంది. ఓ మై గాడ్ కూడా వరుసలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాల తర్వాత ఆయన ఎక్కువ శాతం ఇక రాజకీయాలకు కేటాయించే అవకాశముందంటున్నారు.

2019 నాటికి జనసేన పార్టీని బలోపేతం చేయడంతో పాటు తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో పోటీ చేసే స్థాయికి చేరుకోవాల్సి ఉంది. ఇందు కోసం పవన్ గ్రౌండ్ వర్క్‌కు సిద్ధం కానున్నారట. అదే సమయంలో అభిమానులను అలరించేందుకు సినిమాలకు కొంత సమయం కేటాయించనున్నారు.

English summary
Power Star Pawan Kalyan will concentrate on his Jana Sena party.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu