»   » రీమేక్ సినిమాలకు కొత్త శ్రీకారం చుట్టినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

రీమేక్ సినిమాలకు కొత్త శ్రీకారం చుట్టినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ ఏది చేసినా అది కొత్తే. గతంలో రీమేక్ సినిమాలు చాలా విరివిగా విడుదలయ్యేవి. కాగా ఈమద్య కాలంలో పోలిస్తే మాత్రం ఇది చాలా వరకు తగ్గిందనే చెప్పుకోవాలి. దానికి కారణం మన దర్శకులు కొత్త కొత్త కధలతో సినిమాలు తీయడమే. గతంలో తమిళ సినిమాల్ని మన వాళ్శు ఎక్కవగా రీమేక్ చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు తమిళంలో విడుదలైనటువంటి అన్ని సినిమాలు కూడా తెలుగులోకి డబ్బింగ్ అవుతుండంతో మన సినిమా నిర్మాతలు కన్నడ, మళయాళ సినిమాలను రీమేక్ చేసుకుంటూ సంతృప్తి చెందుతున్నారు.

ఇకపోతే బాలీవుడ్ హిట్ సినిమాలని రీమేక్ చేయడానికి తెలుగు సినిమా నిర్మాతలు ఆసక్తి చూపించలేదు. దానికి కారణం బాలీవుడ్ సినిమాలు నైజాంతో పాటు అన్ని ముఖ్యమైన నగరాలలో విడుదలవుతూ ఉంటాయి. కాబట్టి విడుదలయిన వెంటనే మనవాళ్శు వెంటనే కవర్ చేస్తూ ఉంటారు. దానివల్ల వాటిని రీమేక్ చేసినా ఉపయోగం ఉండకపోవచ్చనే కాబోలు వాటిని రీమేక్ చేయడం మానివేశారు మనవాళ్శు.

కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ దానికి భిన్నంగా బాలీవుడ్ లో హిట్ అయినటువంటి లవ్ ఆజ్ కల్, దబాంగ్ రీమేక్ వల్ల టాలీవుడ్ నిర్మాతలు దృష్టి ఇప్పుడు బాలీవుడ్ సినిమాల మీద పడిందని అంటున్నారు. ఇది మాత్రమే కాకుండా బాలీవుడ్‌లో రీసెంట్‌గా హిట్స్ అయినటువంటి నోవన్ కిల్డ్ జెస్సికా, యమ్లా పగ్లా దీవాలా లాంటి సినిమాలకు మంచి గిరాకీ ఏర్పడిందని ఫిలింవర్గాల సమాచారం. ఇలాగే ఇప్పుడు బాలీవుడ్ సినిమాలకు ఇంత గిరాకీ రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అని అంటున్నారు.

English summary

 The title for the Telugu remake of ‘Love Aaj Kal’ starring Pawan Kalyan, Trisha and Kriti Karbanda has been given as ‘Teen Maar’. The film is taking shape under the direction of Jayanth C Paranjee. This is the first production venture of producer Ganesh Babu under Parameswara Arts banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X