twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కుట్ర చేసారు..వదలను ..తాట తీస్తాను : పవన్ కల్యాణ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఈ సినిమా సక్సెస్ అయ్యిందని నేను మర్చిపోతానని అనుకుంటే అది తప్పు...అది జరగని పని...చేద్దాం..ఒక రోజు అందరికీ చేద్దాం..ఎవరినీ వదలద్దు..ఎవరినీ వదలను...ప్రేమిస్తాం...భరిస్తాం...భరిస్తాం..అవసరమైతే తాట కూడా తీస్తాం...కానీ పరిస్ధితులు..సమాజం..పట్ల గౌరవం కానీ గబుక్కున వదులుకోబుద్దేయదు.. ఓ మాట జారనివ్వదు. ఇది నిగ్రహం తప్ప..చేతకాని తనం కాదు... అంటూ పవన్ చాలా ఎమోషన్ లా మాట్లాడారు.

    పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం విజయోత్సవ వేడుక నగరంలోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ విడుదలకు ముందే పైరసీకి గురైన ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన అభిమానులను అభినందించారు. ఈకార్యక్రమానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నదియా., ప్రణీత, అలీతో పాటు చిత్ర బృందం హాజరయ్యారు.

    ఎప్పుడూ పెద్దగా మాట్లాడని పవన్ ఈ సారి చాలా ఎమోషనల్ గా పైరసీ మీద వ్యాఖ్యలు చేసారు. తాను ఎప్పుడూ ఎవ్వరితోనూ అంతతొందరగా కలవని, కానీ ఇవాళ మాట్లాడలని ఉందని ఎమోషనల్ గా మాట్లాడారు.

    అభిమానులను ఉద్దేశించి పవనిజం అంటే మీరేనని, పవనిజం అంటే సమాజంలో మంచి చేయడం కోసం బ్రతకటమేనని అన్నారు. అలాగే తనకు ఫ్యాన్స్ బలమని, మీకోసం నేను ప్రాణాలు ఇవ్వలేనా అన్నారు. మీరే నా పవర్ అని పవర్ స్టార్ అన్నారు.

    పవన్ కళ్యాణ్ స్పీచ్ పూర్తిగా యధాతథంగా...... స్లైడ్ షోలో...

    మీ ప్రేమే...

    మీ ప్రేమే...


    నేను ఎప్పుడూ లెక్కపెట్టుకోలేదు..ఎన్ని సంవత్సారైలైంది నేను సినిమా ఫీల్డ్ కు వచ్చి అనేది నేను గుర్తు పెట్టుకోలేదు..గుర్తు పెట్టుకోదలుచుకోలేదు.. నాకు సినిమా చేయటం తెలుసు తప్ప..సక్సెస్ మీట్స్ అవీ అలవాటు లేదు... కానీ మొదటి సారిగా..ఈ సినిమాకు సక్సెస్ మీట్ ఉంటే బావుంటుంది అనిపించింది. అంటే నాకు ఒక ఖుషీ తర్వాత...దాదాపు పది సంవత్సరాల తర్వాత మీకు అందరికీ నచ్చే అత్తారింటికి దారేదీ చిత్రం వచ్చింది. నాకు సినిమాలు పట్ల ఇప్పటికీ ఇంట్రస్ట్ ఉండటానికి కారణం మీరు నా పట్ల చూపించే ప్రేమే.

    డిస్కషన్ లో ఉండగా...

    డిస్కషన్ లో ఉండగా...

    నేను ఎప్పుడూ ఘన విజయాలకు ఎప్పుడూ పొంగిపోలేదు. అపజయాలకు ఎప్పుడూ క్రుంగిపోలేదు. ఈ సినిమాకు సక్సెస్ మీట్ ఎందుకు కావాలంటే... ఇక్కడకు రాని, వచ్చిన అందరికీ ధాంక్స్ చెప్పుకోవటానికి ఈ మీట్ ని వేదికగా వాడుకుంటున్నాను...నాకు ఈ సినిమా అనేక రాష్ట్రంలో ఉన్న కారణాల వల్ల రిలీజ్ చేయటానికి ఇబ్బంది పడుతున్న సమయంలో ...గబ్బర్ సింగ్ 2 స్క్రిప్టు డిస్కషన్ కి గోవాలో ఉండగా నాకు ఫోన్ వచ్చింది.

    ఆ ఫోన్ లో ...

    ఆ ఫోన్ లో ...

    నెట్ లో పైరసీ సినిమా వచ్చిందని చెప్పారు, ఎలా బయిటకు వచ్చిందో అర్దం కాలేదు. వినగానే వెంటనే త్రివిక్రమ్ గారికి ఫోన్ చేసి వచ్చేస్తున్నాను అని చెప్పి మధ్యాహ్నం కు వచ్చేసాను. సినిమా వచ్చేసిందని వినగానే నాకు కోపం గానీ...బాధ గానీ కలగలేదు. ఎలా జరిగిందో అని ఆలోచించాము. ఇది త్రివిక్రమ్ గారు మూడు సంవత్సరాలు డవలప్ చేసిన స్క్రిప్టు ఇది. దాదాపు అరవై కోట్లు పెట్టి సినిమా చేస్తే..బయటకు వచ్చేసింది.

    ఆ రోజు మాకు తెలియదు..

    ఆ రోజు మాకు తెలియదు..

    ఎలా వచ్చిందో ఆ రోజుకు తెలియదు కానీ..వచ్చిందనగానే... మొత్తం టీమ్ అందరికీ లోపల అందరీకీ విపరీతమైన బాధ ఎలా తట్టుకోవాలో తెలియదు..ఒక్కసారి బయిటకు వెళితే ఎవరూ చూడరు. ఇక ఈ సినిమా ఎప్పటికీ బయిటకు రాదు...అనే ఆలోచన అందరికీ వచ్చేసింది. అలాంటి బాధ వచ్చినప్పుడు...నేను గానీ,త్రివిక్రమ్ గానీ ఎక్కడా అపజయం అనే ఆలోచన వీసమెత్తు కూడా అనిపించలేదు. దానికి కారణం... మీరు..మీ బలం...మీ వెన్నెంటే ఉన్నారన్న ఒక నమ్మకం ..విశ్వాసం తప్ప వేరే ఆలోచన లేదు మా ఇద్దరికీ...

    సపోర్ట్ ఇచ్చారు కానీ...

    సపోర్ట్ ఇచ్చారు కానీ...

    ... ఈ సినిమాని బయిటకు రాగానే చిత్ర పరిశ్రమనుంచి చాలా సపోర్ట్ వచ్చింది. చాలా ఆనందం కలిగించింది. కానీ ఈ పైరసీని బయిట ఎవరూ చూడలేదు. చిత్ర పరిశ్రమలోని వాళ్లు..ఎవరైతే ఇండస్ట్రీ వాళ్ల కుటుంబానికి ఆధారమో... వాళ్లే పైరసీని బాగా ఎంకరేజ్ చేసారు. ఎందుకంటే..ఐ ప్యాడ్ లో డౌన్ లోడ్ చేసుకుని..డిస్కటాప్ లో చూసుకుంటూ... మాకు ఫోన్ లు చేసారు..ఫోన్ చేసి...మీరేమీ భయపడక్కర్లేదు..సినిమా చాలా బాగుందని చెప్పారు. వాళ్లు చాలా మంది ఉన్నారు...వాళ్లందరి పేర్లు చెప్పలేం.

    అర్దం కాలేదు...

    అర్దం కాలేదు...


    కానీ మాకు ఇలాంటి రియాక్షన్ కూడా చూసి..నవ్వాలా ఏడవాలా అనేది కూడా అర్దం కాలేదు..వీళ్లకేమాత్రం కామన సెన్స్ ఉందా...ఎద్దు పుండు ...కాకికి రుచి అన్నట్లు..మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లు..చేసారు. అయితే మాకు తెలుసు..ఈ సినిమా మీకు చాలా ఆనందం కలిగిస్తుంది...ఘన విజయం సాధిస్తుందని ఖచ్చితమైన నమ్మకం ఉంది.

    నా పవర్ మీరే...

    నా పవర్ మీరే...

    నా వెనకాల ఉంది మీరే ..మీరే నా పవర్...మీరు లేకపోతే నేను ఉంటానా..తల్లి తండ్రుల తర్వాత...అన్న వదినలు తర్వాత అంత సపోర్టు మీరే కదా...మీ కోసం..నేను ప్రాణాలు ఇవ్వలేనా...మీరు చూపించే ప్రేమాభిమాలుకు అని ఎమోషనల్ గా అన్నారు. ఎప్పుడో గానీ నాకు మాట్లాడాలని కోరక రాదు..ఇవాళ మాట్లాడాలనిపించింది. అంటూ పైరసీ రాగానే ఎలర్టైన పోలీసులుకు, సైబర్ టీమ్ కు ధాంక్స్ చెప్పారు.

    పవనిజం అంటే....

    పవనిజం అంటే....

    పవనిజానికి అర్దమేమిటో నాకు తెలియదు. సమాజం కోసం..దేసం కోసం బ్రతకటం అయితే అదే పవనిజం...ముందుగా నేను...కంక్లూడ్ చేయబోయే ముందు.. చిన్నప్పుడు నేను ఎప్పుడూ సినిమా యాక్టర్ అవ్వాలనుకోలేదు..చిన్న పొలముంటే కొన్ని మొక్కలు వేసుకోలేదు. అది కూడా ఎక్కువ ఎకరాలు కాదు..మాగ్జిమం మా నాన్న ఓ ప్రభుత్వ ఉద్యోగి..నేను పెద్దగా చదువుకోలేదు..కాబట్టి ఎక్కువ ఆశపెట్టుకోలేదు..ఇప్పటికీ నేను రైతుగా బ్రతకటానికి ట్రై చేస్తున్నాను.. ఎప్పుడుకి పూర్తవుతుందో తెలియదు. నాకు చాలా బలవంతంగా సినిమాల్లోకి వచ్చింది.. విధి నన్ను నటుడువి అవమని బలవంతంగా ఫుష్ చేసింది.

    కుదరలేదు...

    కుదరలేదు...

    అలా ఇష్టం లేకుండానే మొదటి సినిమా కూడా చేసాను..కానీ నాకు నచ్చిన సినిమా గోకులంలో సీత. కానీ నేను ఓన్ వాయిస్ తీసుకుని చేసిన సినిమా తొలిప్రేమ. తొలిప్రేమలో పెద్ద విలన్స్ ఉండరు..రౌడీలు ఉండరు.. కానీ మనకు తెలిసిన ఎమోషన్స్..మన కుటుంబాలు..మన నాన్న, మన చెల్లి ఉంటాయి. కానీ తర్వాత ఇంతకాలంలో అలాంటి సినిమా రాలేదు. చాలా కాలం నుంచి అలాంటి సినిమా మళ్లీ చేయాలని ఎదురుచూస్తున్నాను. ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు.

    త్రివిక్రమ్ గారే...

    త్రివిక్రమ్ గారే...

    అలాంటి మేం అనుకున్న కథకు రూపకర్త త్రివిక్రమ్. నేను త్రివిక్రమ్ గారూ కలిసిన విధానం గొప్పగా లేదు. ఆయన కథ చెప్తూంటే నిద్రపోయాను. అదేంటో ఎవరు కథ చెప్పినా ఎలర్ట్ గా ఉంటాను. అలాంటిది ఆయన కథ చెప్తూంటే నిద్ర వచ్చింది ఆశ్చర్యంగా. కానీ...ఆయన పట్టు వదలిన విక్రమార్కుడులా నన్ను వేథించి,వెంటబడి..జల్సా చేసారు. అప్పటినుంచి మా ఇద్దరి భావజాలం ఒకటే అవటం వల్ల...ముందుకు వెళ్తున్నాం. మా భావజాలం సాధ్యమైనంతవరకూ సర్దుకుపోయాలా చేస్తుంది. అయితే తప్పనిసరి పరిస్ధితి అయితే ఊహించనంతగా ఎదురుతిరుగుతాం.

    కథ అలా ఉండాలని...

    కథ అలా ఉండాలని...

    సమాజం అంటే గౌరవం ఉండాలి.. కుటుంబ బంధాలు ఇలా ఉండాలి. ఎంతసేపూ మేనత్త పాత్రను చులకను చూపించే ఇలాంటి కాలంలో మేనత్త తల్లి లాంటిదే అని చూపించిన త్రివిక్రమ్ గారికి ధాంక్స్ చెప్పుకుంటున్నాను. స్త్రీ పట్ల, అక్క చెల్లెలు పట్ల గౌరవం చూపించలేని సమాజం ఎక్కవ కాలం మన్నదు..చితికిపోతుంది. అలాంటి ఐడియాలజితో సినిమా చేసి అందరకీ ఆనందం కలిగ చేసిన నా మిత్రుడు,నేస్తం...త్రివిక్రమ్ గారికి మరోసారి ధాంక్స్ చెప్పుకుంటున్నాను.

    రక్తం కారుతుంది...

    రక్తం కారుతుంది...

    మాకు ఓ సినిమా చేయటానికి మూడు సంవత్సరాల తపన...కథ చేయటం ఎంత కష్టమో... తెల్ల కాగితం ,పెన్ పట్టుకుంటే రక్త కారుతుంది. నేను ప్రయత్నించినవాడినే ఆ కష్టం నాకు తెలుసు..మనం కథలు ఎందుకు వెతుక్కుంటామంటే మనం మన జీవితంలో రోజు వారి జరిగే సమస్యలుకు పరిష్కారం వెతుకుతాం. మేం...కూడా కథ చెప్పేటప్పుడు ఆ సమాధానాలు, ప్రశ్నలు వెతుకూంటే మాకు దొరికిన స్క్రిప్టు ఇది. మేము ఇంత కష్టపడి..స్క్రిప్టు చేస్తే కంచే చేను మేసిందన్నట్లుగా నమ్మకం ద్రోహం చేసింది ఎవరో బయిట వాళ్లు కాదు లోపల వాళ్లే..ఒక రోజు చెప్తాను.

    అందరికీ చెప్తాను..

    అందరికీ చెప్తాను..

    ఇది ఒక రోజుతో అవదు..పోలీసు శాఖ పట్టుకుంది..బయిటకు కనిపించిన వ్యక్తులనే కానీ... పైరసీ చేయించిన వ్యక్తులను..ఇది పైరసీ కాదు..కాన్సరసీ(కుట్ర). దానికి కారణం... రెండు నెలలు నిజంగా పైరసీ చేయదలుచుకుంటే...వాళ్ళు రెండు నెలలు అలా పెట్టుకు కూర్చోరు. ఎవరి మాటైతే విని పైరసీ చేసారో.. వాళ్లను నేను సభాముఖంగా హెచ్చరిస్తున్నాను... ఈ పైరసీని.. ఎవరైతే చేయమని ప్రోత్సహించారో..రాబోయే సంవత్సరంలో మీ అందరినీ పేరు పేరునా గుర్తు పెట్టుకుంటాను. వీళ్లు ఏ స్ధాయి వ్యక్తులైనా గానీ..ఎలాంటి వాళ్లైనా గానీ...మీకు ఎలాంటి న్యాయం జరగాలో అలాంటి న్యాయం జరిగాలో నేను చేస్తాను.

    మర్చిపోను....

    మర్చిపోను....

    ఈ సినిమా సక్సెస్ అయ్యిందని నేను మర్చిపోతానని అనుకుంటే అది తప్పు...అది జరగని పని...చేద్దాం..ఒక రోజు అందరికీ చేద్దాం..ఎవరినీ వదలద్దు..ఎవరినీ వదలను...ప్రేమిస్తాం...భరిస్తాం...భరిస్తాం..అవసరమైతే తాట కూడా తీస్తాం...కానీ పరిస్ధితులు..సమాజం..పట్ల గౌరవం కానీ గబుక్కున వదులుకోబుద్దేయదు.. ఓ మాట జారనివ్వదు. ఇది నిగ్రహం తప్ప..చేతకాని తనం కాదు...

    ఆ కుళ్లు మాకు లేదు...

    ఆ కుళ్లు మాకు లేదు...


    నాకు కానీ త్రివిక్రమ్ గారికి అందరికి మా సినిమాలే ఆడాలని అనుకోం..365 రోజులూ మా సినిమాలూ ఉండాలని అనుకోం...మాది ఎప్పుడూ ఒక్క రోజే. ఇంకా ప్రపంచానికి...జీవితానికి 364 రోజులు ఉన్నాయి. మాకు అలాంటి కుంచింతమైన ఆలోచనలు..తక్కువ స్ధాయి ఆలోచనలు లేవు...మేమిద్దరం...విన్ విన్ సిట్యువేషన్ కోరుకుంటాం. వీళ్లెంత నలుసంత...పెద్ద పెద్ద వాటికి రెస్పాండ్ అవుందాం...కుళ్లు కుతంత్రాలు మాకు లేవు.

    English summary
    At the Attarintiki Daredi 'Thank You Function' the Power Star spoke for almost forty minutes. The actor went on to accuse "some hidden big hands" for conspiring to leak the pirated version of Attarintiki Daredi, a week before the film's theatrical release. ''I'm not going to let go of the issue just because the movie has turned out to be a hit. I will make you pay for your crime and will not relent until justice is done," Pawan fumed. As a pirated version of the movie (Attarintiki Daredi) hit the internet a week before its official theatrical release, the producer released the movie a week in advance to control the damage. An editing assistant who was responsible for the piracy was arrested by the Police. The big question on everybody's mind is who was Pawan Kalyan hinting at. 
 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X