»   » హాట్ టాపిక్ : పవన్ కల్యాణ్ పై కుట్ర వారిదా?

హాట్ టాపిక్ : పవన్ కల్యాణ్ పై కుట్ర వారిదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో కాదు యావత్ ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు సినిమా అభిమానులందరికీ ఒకటే హాట్ టాపిక్ గా మారింది. ఎవరా...కుట్రదారుడు..పవన్ కళ్యాణ్ ని కుట్ర చేసి దెబ్బ కొట్టాలని ప్రయత్నించింది ఎవరు అనేదే...ఎవరికి తోచిన విధంగా వారు సమాధానాలు ఇచ్చుకుంటున్నారు. ఒక హీరో అని కొంతమంది కాదని మరికొంతమంది...ఓ నిర్మాత అని కొంతమంది..కాదని కొంతమంది ఇలా పజిల్ పూర్తి చేసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. అసలు ఎవరు ఆ కుట్ర దారుడు...తమ సినిమా మాత్రమే ఆడాలని భావిస్తూ...ఎదుటి వారి సినిమా ఫ్లాఫ్ కావాలని కావాలని పైరిసీని ఎంకరేజ్ చేసిన దుర్మార్గుడు అనేది పవన్ అభిమానుల్లో పెద్ద ప్రశ్న. మీడియా వ్యక్తుల్లోనూ రకరకాల ఆలోచనలు ఈ విషయమై రేగుతున్నాయి. అయితే ఎవరూ ధైర్యం చేసి ఫలానా అని చెప్పలేకపోతున్నారు.

ఇది ఒక రోజుతో అవదు..పోలీసు శాఖ పట్టుకుంది..బయిటకు కనిపించిన వ్యక్తులనే కానీ... పైరసీ చేయించిన వ్యక్తులను..ఇది పైరసీ కాదు..కాన్ స్పిరసీ(కుట్ర). దానికి కారణం... రెండు నెలలు నిజంగా పైరసీ చేయదలుచుకుంటే...వాళ్ళు రెండు నెలలు అలా ప్రింట్ తమ దగ్గర పెట్టుకు కూర్చోరు. ఎవరి మాటైతే విని పైరసీ చేసారో.. వాళ్లను నేను సభాముఖంగా హెచ్చరిస్తున్నాను... ఈ పైరసీని.. ఎవరైతే చేయమని ప్రోత్సహించారో..రాబోయే సంవత్సరంలో అందరినీ పేరు పేరునా గుర్తు పెట్టుకుంటాను. వీళ్లు ఏ స్ధాయి వ్యక్తులైనా గానీ..ఎలాంటి వాళ్లైనా గానీ.. ఎలాంటి న్యాయం జరగాలో అలాంటి న్యాయం జరిగాలో నేను చేస్తాను అంటూ పవన్ ఘాటుగా వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ అంత ఖచ్చితంగా... ధీమాగా తాట తీస్తా అని హెచ్చరించేసరికి అందరూ షాకయ్యారు. దాదాపు నలభై నిముషాలు సేపు సాగిన ఆ ప్రసంగం చాలా భావోద్వేగంగా సాగింది. తన దగ్గర ఖచ్చితమైన ఆధారాలు లేకపోతే పవన్ అలా రెస్పాండ్ కాడు అంటున్నారు. ఈ సినిమా సక్సెస్ అయ్యిందని నేను మర్చిపోతానని అనుకుంటే అది తప్పు...అది జరగని పని...చేద్దాం..ఒక రోజు అందరికీ చేద్దాం..ఎవరినీ వదలద్దు..ఎవరినీ వదలను...ప్రేమిస్తాం...భరిస్తాం...భరిస్తాం..అవసరమైతే తాట కూడా తీస్తాం...కానీ పరిస్ధితులు..సమాజం..పట్ల గౌరవం కానీ గబుక్కున వదులుకోబుద్దేయదు.. ఓ మాట జారనివ్వదు. ఇది నిగ్రహం తప్ప..చేతకాని తనం కాదు... అంటూ పవన్ చాలా ఎమోషన్ లా మాట్లాడారు.

పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం విజయోత్సవ వేడుక నగరంలోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ విడుదలకు ముందే పైరసీకి గురైన ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన అభిమానులను అభినందించారు. ఈకార్యక్రమానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నదియా., ప్రణీత, అలీతో పాటు చిత్ర బృందం హాజరయ్యారు. ఎప్పుడూ పెద్దగా మాట్లాడని పవన్ ఈ సారి చాలా ఎమోషనల్ గా పైరసీ మీద వ్యాఖ్యలు చేసారు. తాను ఎప్పుడూ ఎవ్వరితోనూ అంతతొందరగా కలవని, కానీ ఇవాళ మాట్లాడలని ఉందని ఎమోషనల్ గా మాట్లాడటం చాలా మందిని సస్పెన్స్ లో పడేసింది. కొంతమందికి మాత్రం ఖచ్చితంగా గుండెళ్లో రైళ్లు పరుగెత్తే ఉంటాయంటున్నారు.

English summary
At the Attarintiki Daredi 'Thank You Function' Pawan Kalyan went on to accuse "some hidden big hands" for conspiring to leak the pirated version of Attarintiki Daredi, a week before the film's theatrical release. ''I'm not going to let go of the issue just because the movie has turned out to be a hit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more