»   » పవన్ ఫ్యాన్ హత్యకు ముందు... చివరి స్పీచ్, చివరి పోస్ట్!

పవన్ ఫ్యాన్ హత్యకు ముందు... చివరి స్పీచ్, చివరి పోస్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని వినోద్ రాయల్ హత్యోదంతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్రచర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన అంశాలు వైరల్‌‌లా షేర్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల తరుపు జరిగే సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే వినోద్ రాయల్..... కర్నాటకలోని కోలార్ లో అవయవ దానం అంశంపై జరిగే సభలో పాల్గొనేందుకు వెళ్లారు. కర్ణాటకలో అవయవదానం గురించి మాట్లాడేందుకు వెళ్లేముందు తన ఫేస్ బుక్ లో అందుకు సంబంధించిన పోస్ట్ పెట్టాడు.

'తాను అవయవదానంపై అవగాహన కల్పించేందుకు పవన్ ఫ్యాన్స్ కర్ణాటకలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్నానని... మేం కేవలం పవన్ ఫ్యాన్స్ కాదు... పవన్ ఆలోచనా విధానానికి ఫాలోవర్స్ కూడా' అంటూ వినోద్ రాయల్ పెట్టిన చివరి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ లా షేర్ అవుతోంది.

వినోద్ రాయల్ చివరి పోస్టు చూసి ఇతర పవన్ అభిమానులు మరింత కుమిలిపోతున్నారు. ఓ మంచి కార్యక్రమానికి వెళ్లినందుకు వినోద్ కు ఇలాంటి పరస్థితి ఎదురు కావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్లైడ్ షోలో ఫోటోలు, వీడియో, మరిన్ని వివరాలు...

సోషల్ మీడియాలో ట్రెండింగ్

సోషల్ మీడియాలో ట్రెండింగ్

వినోద్ రాయల్ హత్యోదంతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారి పోయింది.

జాతీయ మీడియా వరకు

జాతీయ మీడియా వరకు

దీంతో ఈ హత్యోదంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పరిధి దాటి జాతీయ మీడియాలో చర్చ వరకు వెళ్లింది.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

వినోద్ రాయంల్ కుటుంబాన్ని పరామర్శించి, అన్ని విధాల సహాయం చేసేందుకు పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు.

తల్లి మనసు

తల్లి మనసు

మరో ఆరు నెలల్లో అమెరికాకు వెళ్లాల్సిన వినోద్ ఇలా హత్యకు గురికావడంతో ఆ కుటుంబం సైతం ఎంతో వినోద్ రాయల్ తల్లి మనసు తడిల్లిపోతోంది.

పవన్ వెళ్లి ఓదార్చారు

పవన్ వెళ్లి ఓదార్చారు

పవన్ తిరువారం తిరుపతిలోని వినోద్ రాయల్ ఇంటికి వెళ్లి వినోద్ కుటుంబాన్ని ఓదార్చారు.

దారుణం

దారుణం

కోలార్‌లో పవన్‌కల్యాణ్‌ అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన అవయవదాన కార్యక్రమానికి వినోద్‌ హాజరయ్యాడు. అనంతరం స్నేహితుల నడుమ జూనియర్ ఎన్టీఆర్, పవన కల్యాణ్‌ విషయమై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో తమ హీరో గొప్ప అంటూ ఎవరికి వారు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో అసహనానికి గురైన ఆ హీరో అభిమాని వినోద్‌ను కత్తితో పొడిచాడు.

ఆసుపత్రికి తరలించినా

ఆసుపత్రికి తరలించినా

తీవ్రంగా గాయపడిన అతడిని స్నేహితులు చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. సోమవారం నగరంలోని వినోద్‌ స్వగృహానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. జనసేన కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.

వినోద్ స్పీచ్

వినోద్ స్పీచ్

English summary
Pawan kalyan fan vinod final speech just before he was murdered. In a clash between the fans of Telugu film star, Pawan Kalyan and those of Jr NTR, a man was stabbed to death.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu