»   » పంబ రేపిన పవన్ ఫ్యాన్స్, థియేటర్లో రచ్చ(ఫోటోలు)

పంబ రేపిన పవన్ ఫ్యాన్స్, థియేటర్లో రచ్చ(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు 'అత్తారింటికి దారేది' చిత్రం 100 రోజులు వేడుకను గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఈలలు వేసి గోల గోల చేసారు. దిక్కులు పిక్కటిల్లేలా జై పవర్ స్టార్, జై పవనిజం అంటూ నినాదాలు చేసారు. తమ మనసులో అభిమానాన్ని వివిధ రకాలుగా బయట పెట్టారు.

అభిమానులను కంట్రోల్ చేయడానికి పోలీసులు థియేటర్లోకి వచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గుంటూరు పల్లవి థియేటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏలూరులో పవన్ అభిమానులు 'గో గ్రీన్' నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా ఫ్లాష్ మోబ్ నిర్వహించారు.

100 రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల పవన్ కళ్యాణ్ అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ర్యాలీలు నిర్వహించారు. కేక్ కట్ చేసారు. స్వీట్లు పంచారు. అన్నదానం చేసారు. ఇలా చాలా చాలా చేసారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఫ్యాన్స్ తమ సోషల్ నెట్వర్కింగ్ పేజీల్లో పోస్టు చేసారు.

ఫ్యాన్స్ గోల, పోలీసుల ఎంట్రీ

ఫ్యాన్స్ గోల, పోలీసుల ఎంట్రీ


అత్తారింటికి దారేది చిత్రం 100 రోజుల వేడుక సందర్భంగా గుంటూరు పల్లవి థియేటర్లో ఫ్యాన్స్ గోల గోల చేయడంతో వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.

ఫ్లాష్ మోబ్

ఫ్లాష్ మోబ్


పవనిజాన్ని పబ్లిక్‌లోకి తీసుకెళ్లడంలో పాటు ‘గో గ్రీన్' నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా ఫ్లాష్ మోబ్ నిర్వహించిన పవన్ అభిమానులు.

సంబరాల ర్యాలీ

సంబరాల ర్యాలీ


అత్తారింటికి దారేది చిత్రం 100 రోజుల వేడుక సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు నిర్వహించిన ర్యాలీ.

వరంగల్ నిట్‌లో

వరంగల్ నిట్‌లో


వరంగల్ నిట్‌లో పవన్ కళ్యాణ్ అభిమానుల అత్తారింటికి దారేది 100 రోజుల సెలబ్రేషన్స్.

పవన్ కళ్యాణ్‌కి దండాలు

పవన్ కళ్యాణ్‌కి దండాలు


పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన్ను దేవుడులా కొలుస్తుంటారు. అందుకు నిదర్శనమే ఈ ఫోటో....

English summary
Pawan Kalyan fans celebrate Attarintiki Daredi success in grandway. Attarintiki Daredi is the feature film soundtrack of the 2013 family drama film Attarintiki Daredi starring Pawan Kalyan, Samantha Ruth Prabhu and Pranitha Subhash.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu