»   » పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ ఉద్యమకారులు

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ ఉద్యమకారులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఈ రోజు గ్రాండ్‌గా రిలీజైన సంగతి తెలిసిందే. రాజకీయ కారణాలతో ముడిపెట్టి....అన్యాయంగా పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకుంటున్న తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమకారుల తీరుపై పవర్ స్టార్ అభిమానులు గుర్రుగా ఉన్నారు.

పలు చోట్ల అభిమానులు ఉద్యమకారుల ప్రయత్నాలను భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని సమైక్యవాదులు, అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని పవన్ అభిమానులు మోహరించడంతో విశాఖలోని విమాక్స్ తియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి. ఇలాంటివి జరుగుతాయని ముందే పసిగట్టిన పోలీసులు కొన్ని థియేటర్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసారు. ఒక సినిమా హీరో కోసం అభిమానులు ఈ రేంజిలో రోడ్డెక్కి పోరాటానికి సిద్ధమవ్వడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

సినిమా వివరాల్లోకి వెళితే...సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
Pawan Kalyan fans protect the Attarintiki Daredi movie from Samaikyandhra and Telangana Activists.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu