»   » రాష్ట్ర విభజనపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలా...!

రాష్ట్ర విభజనపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలా...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ, సమాంధ్రగా విభజిస్తూ....అధికార యూపీఏ కూటమి, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మరో ఐదు నెలల్లో రెండు రాష్ట్రాలు ఏర్పడబోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో సంబరాలు మొదలైతే....సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు తమదైన రీతిలో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రం రెండు ముక్కలైనా పవన్ ఫ్యాన్స్ మాత్రం యూనిటీగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. మేము తెలంగాణకు చెందిన వారం కాదు, ఆంధ్రకు చెందిన వారం కాదు....మేమంతా 'పవనిజం' కాన్సెప్టుతో ముందుకు సాగుతాం అంటూ సోషల్ నెట్వర్కింగులో హోరెత్తిస్తున్నారు.

మనకు ఈ గొడవలు, తిట్టుకోవడాలు వద్దు....మన మతం, మన బాష, మన కులం, మన ప్రాంతం ఒకటే, మనం అందరం ఇప్పుడు అప్పుడు ఎప్పటికీ ఒక్కటే....జై పవనిజం అంటూ ఒకరికొకరు మెసేజ్‌లు పంపించుకుంటున్నారు. ఇలాంటి పరిణామాలు రెండు ప్రాంతాల అభిమానుల మధ్య మంచి స్నేహ పూరిత వాతావరణానికి దారి తీస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరో ఆసక్తికర విషయం ఏమింటే పవన్ కళ్యాణ్ అభిమానులు....తమ అభిమాన హీరో బాటలో సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. ఫండ్స కలెక్ట్ చేసి మంచి పనులు నిర్వహించే స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నారు.

English summary
Pawan Kalyan fans Unity. They said, we are Not Belongs To Telangana, we are Not Belongs To Andhra, we are Belongs To ‪‎PAWANISM.‬
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu