»   »  పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టార్గెట్ మహేష్ కత్తి.... ఏమిటీ గొడవ?

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టార్గెట్ మహేష్ కత్తి.... ఏమిటీ గొడవ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ సినీ విమర్శకుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ మహేష కత్తి గురించి నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. అసలు ఆయన ఏమన్నారు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన్ను టార్గెట్ చేయడానికి కారణం ఏమిటి? ఓ సారి చూద్దాం.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ కత్తి...... 'కాటమరాయుడు' సినిమా బాగోలేదని తాను రాసిన రివ్యూ చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనను బెదిరించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అభిమానులు అభిమానుల్లా ఉండటం లేదని, ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని అభిప్రాయ పడ్డారు.

‘కాటమ రాయుడు' సినిమా విషయంలో బెదిరించారు

‘కాటమ రాయుడు' సినిమా విషయంలో బెదిరించారు

‘కాటమరాయుడు' సినిమాను నేను విమర్శించడంతో ఫ్యాన్స్ బెదిరించారు. నాకు సినిమా అస్సలు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ పెద్ద యాక్టర్ అని నేను అనుకోను. అతడు స్టార్. స్టార్ చేయాల్సిన సినిమా అది కాదు, ఈ టైంలో చేయాల్సిన సినిమా కాదు అని చెప్పాను. ఇది నా అభిప్రాయం. నా అభిప్రాయాన్ని వ్యతిరేకించడం ఎందుకో నాకు అర్థం కావడం లేదు అని... మహేష్ కత్తి అన్నారు.

అతడు గొప్ప యాక్టర్ అని అతడేమన్నా చెప్పాడా?

అతడు గొప్ప యాక్టర్ అని అతడేమన్నా చెప్పాడా?

పవన్ కళ్యాణ్ నేను గొప్ప యాక్టర్ అని ఎప్పుడూ చెప్పలేదు. అతడి యాక్టింగ్ చూసిన తర్వాత నాకు కూడా ఆ విషయం అర్థమైంది. అది నా అభిప్రాయం.... కానీ అతడు పెద్ద యాక్టర్ అని నేను ఒప్పుకోవాలని ఒత్తిడి చేయడానికి ఫ్యాన్స్ ఎవరు? అని మహేష్ కత్తి ప్రశ్నించారు.

వారికి వచ్చిన సమస్య ఏమిటి?

వారికి వచ్చిన సమస్య ఏమిటి?

నాకు ఆ సినిమా నచ్చక పోతే వారికి వచ్చిన సమస్య ఏమిటి? వీరు ఆ సినిమా చూసి హిట్ చేసి ఉండొచ్చుగా.... కానీ అలా జరుగలేదు. ఆ సినిమా చివరకు ప్లాప్ అయింది. మరి ఎందుకు ఇవన్నీ అంటూ మహేష్ కత్తి అభిప్రాయ పడ్డారు.

ఫ్యాన్స్ ఉన్మాద స్థాయికి వెళ్లడం ఏమిటి?

ఫ్యాన్స్ ఉన్మాద స్థాయికి వెళ్లడం ఏమిటి?

ఓసారి ‘మా ఫ్యాన్ పేజీలో నీ ఫోన్ నెంబర్ షేర్ చేశారు. నువ్వు ఎక్కడుంటావో మాకు తెలుసు' అని బెదిరించారు, ఫ్యాన్స్ ఉన్మాద స్థాయికి వెళ్లడం ఏమిటి? అని మహేష్ కత్తి ప్రశ్నించారు.

నేనేమీ తప్పించుకు తిరగడం లేదు

నేనేమీ తప్పించుకు తిరగడం లేదు

నేనేమీ తప్పించుకు తిరగడం లేదు. నేను రివ్యూ చెప్పేప్పుడు 10 టీవీకి వచ్చి కొట్టొచ్చు. శ్రీనగర్ కాలనీలోనే తమ్మారెడ్డి భరద్వాజ ఆఫీసులోనే ఉంటాను. వీళ్లు ఎంత సంకుచితంగా ఆలోచిస్తున్నారు అనేది చూస్తే జాలేస్తుంది. వీళ్లని ఫ్యాన్స్ అంటామా? ఉన్మాదులంటామా? సమాజానికి పట్టిన చీడ అంటామా? అనేది పెద్ద సమస్య. వాళ్లని క్షమించి వదిలేయడమే తప్ప, వాళ్ల మీద కోపం, కంటగింపు కలించుకుంటే నాకు మెంటల్ గా అనవసరమైన సమస్య.... అని మహేష్ కత్తి అన్నారు.

ఎవరైనా ఖండించారా?

ఎవరైనా ఖండించారా?

‘కాటమరాయుడు' మాదిరిగానే ‘డిజె' విషయంలో కూడా ఇలానే జరిగింది. ఆడియో లాంచుల్లో మీసాలు మెలేయడాలు, తొడలు కొట్టడాలు, మా ఫ్యాన్స్ ఉన్నారు, ఇది చేస్తారు అనడాలు.... మీరు ఇలాంటివి చేయడం వల్లనే ప్రేక్షకులకు రాంగ్ సందేహాలు అందుతున్నాయి. ఇలాంటి సంఘటన ఏదైనా జరిగినపుడు ఏ హీరో అయినా ఎప్పుడైనా, ఎవరినైనా ఖండించారా? అని మహేష్ కత్తి ప్రశ్నించారు.

ఇన్ సెక్యూరిటీలో బ్రతుకుతున్నారు

ఇన్ సెక్యూరిటీలో బ్రతుకుతున్నారు

ఇలాంటివి జరిగినపుడు హీరోలు ఎవరూ ఖండించరు. ఎందుకంటే వాళ్ల సేఫ్టీ వాళ్లకు ముఖ్యం. సినిమా ఓపెనింగ్స్ ముఖ్యం, ఫ్యాన్స్‌ను ఏమైనా అంటే రేపు ఓపెనింగ్స్ రావేమో అనే భయం, అందరూ ఇలా ఇన్ సెక్యూరిటీలో బ్రతుకుతున్నారు... అని మహేష్ కత్తి అన్నారు.

అలా చేస్తే అందరూ మీ ఫ్యాన్సే

అలా చేస్తే అందరూ మీ ఫ్యాన్సే

పెద్ద స్టార్లు అంతా ఇన్ సెక్యూరిటీ నుండి బయటకు వచ్చి, సినిమా కోసం, వాళ్ల కోసం నిలబడితే ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారో చూడండి, అందరి ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్ అవుతారు అనేది గుర్తుంచాలి అని మహేష్ కత్తి అన్నారు.

విష సంస్కృతి స్ప్రెడ్ చేయొద్దు

విష సంస్కృతి స్ప్రెడ్ చేయొద్దు

ఫ్యాన్స్‌ను విడదీయటాలు, ఫ్యాన్స్‌ను కన్సలరేట్ చేసుకోవడాలు.... లాంటివి లాంగ్ టైమ్ సొల్యూషన్స్ అయితే కాదు. ఫ్యాన్స్ ఉన్మాదాన్ని పెంచి పోషించడాలు అస్సలు మంచిది కాదు. కాబట్టి పెద్ద హీరోలకు ఓపెన్ గా చెప్పేది ఏమిటి అంటే మీరు మీ ఫ్యాన్స్ ను కంట్రోల్ లో పెట్టుకోండి. లేదంటే వారిని డిస్ ఓన్ చేసుకోండి. అప్పుడే మీ సినిమాలు నిలబడతాయి, మీరు మనుషులుగా నిలబడతారు. అనవసరంగా సమాజంలో ఒక విష ప్రవృత్తి స్ప్రెడ్ చేయొద్దు.... అని మహేష్ కత్తి స్టార్ హీరోలకు సూచించారు.

English summary
Mahesh Kaththi has become quite a popular name among masses after his stint in ‘Big Boss’. His comments on Pawan Kalyan’s ‘Katamarayudu’ and political agenda had made him the favourite of trolls by Mega fans.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu