»   »  పవన్ ఫ్యాన్స్ బెదిరింపు కాల్ పై ఎన్.శంకర్

పవన్ ఫ్యాన్స్ బెదిరింపు కాల్ పై ఎన్.శంకర్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : 'ఇంకోసారి నా కళ్యాణ్‌ని ఏమైనా అంటే నేను చచ్చినా ఫర్వాలేదు.. నిన్ను నరికే స్తా...నా...' ఇదీ ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్‌కు పవన్ కళ్యాణ్ అభిమానుల పేరిట వచ్చిన ఎస్సెమ్మెస్. ఇది 9492952695 నెంబర్ సెల్ నుంచి శంకర్ సెల్‌కు వచ్చింది. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం నిషేదించాలంటూ తను కోరటంపై తనను బెదిరిస్తున్నారంటూ ఎన్.శంకర్ మీడియాకు వివరించారు.

  'నటుడు పవన్ కళ్యాణ్ అభిమానుల పేరిట నాకు బెదిరింపు ఎస్సెమ్మెస్‌లు వస్తున్నాయి. నన్ను చంపేస్తానని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధమే' అని దర్శకుడు ఎన్ శంకర్ తెలిపారు. టీజేఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

  ''పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను కించపర్చినట్లు నిర్మించడంపై నేను స్పందించా. ఆ సినిమాలోని పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశా. దీన్ని జీర్ణించుకోలేని ఆయన అభిమానుల పేరిట కొంతమంది నన్ను హతమారుస్తామంటూ సెల్‌ఫోన్‌కు ఎస్సెమ్మెస్‌లు పంపుతున్నారు. శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదో చాప్టర్‌లో భాగంగా కుట్రలన్నీ అమలవుతున్నాయి. నాకు హెచ్చరికలు చేసిన అభిమానులు చైతన్యంతో వచ్చి నాతో మాట్లాడాలి. వాస్తవాలను వివరిస్తా. ఆ తర్వాత నన్ను చంపినా అర్థం ఉంటుంది. అభిమానులను హీరోలు కాపలా కుక్కలుగా తయారు చేస్తున్నారు. వారి వలలో పడకండి'' అని శంకర్ సూచించారు.

  'జుట్టు పట్టుకొని కొట్టుకున్న హీరోలంతా ఒక్కటయ్యారు. కనీసం ముఖం చూడ్డానికి కూడా ఒప్పుకోని హీరోలు వారి అభిమానులను ఏకం చేస్తూ ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. సీమాంధ్ర భావజాలాన్ని సినిమాల్లో రుద్దడం, తెలంగాణవాదులను గందరగోళానికి గురి చేయడం, తెలంగాణవాదులను అవహేళన చేయడం, తెలంగాణవాళ్లను వికృతరూపంలో చిత్రీకరించడం వంటి ఘటనలకు సినీరంగం వేదికగా మారుతోంది. తెలంగాణలో సాంస్కృతిక విధ్వంసాన్ని సాగిస్తున్నారు. సాంస్కృతిక ఉద్యమాన్ని ఊరూ, వాడా తీసుకెళ్తా..' అని శంకర్ చెప్పారు.

  తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తూ తీసిన రాంబాబు సినిమాను పూర్తిగా నిషేధించాలని దర్శకుడు శంకర్ డిమాండ్ చేశారు. డిస్ట్రిబ్యూటర్స్‌కు వచ్చే నష్టాన్ని దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో పవన్ కల్యాణ్ భరించాలన్నారు. నిర్మాత దిల్‌రాజు తెలంగాణకు చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు.

  English summary
  N Shankar complained at Banjara Hills Police Station that he is getting life threatening calls from Pawan fans those are warning him that he would be killed if talked against Pawan Kalyan. He also said that he recorded a call. He also said that he is getting vulgar and threatening SMSes from Pawan fans. 
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more