»   » లేడి పిల్లతో ముస్తాబైన పవన్ ‘పులి’..!

లేడి పిల్లతో ముస్తాబైన పవన్ ‘పులి’..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ ముందున్నాడు..జెనీలియా అతని వెనక ఉంది. ఇదేంటి అనుకుంటున్నారా? సౌత్ స్కోప్ మ్యాగజైన్ పై వీళ్ళిద్దరూ ఇలా దర్శనమివ్వ బోతున్నారు. కవర్ పేజీ పై పవన్ కళ్యాణ్ అలరిస్తుంటే, బ్యాక్ పేజీలో జెనీలియా దర్శనమిచ్చి కొల్లగొడుతోంది. పవన్ కళ్యాణ్ 'కొమరం పులి" గెటప్ లో దర్శనమిచ్చాడు ముందు పులి..వెనకాల లేడి పిల్లతో ముస్తాబైన సౌత్ స్కోప్ మ్యాగజైన్ పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పత్రిక కోసం జెనీలియా ప్రత్యేకంగా ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోల్లో చాలా క్యూట్ గా కనిపించి ఆకట్టుకుంటోంది.

ఎస్ జె సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 'కొమరం పులి" విడుదలకు సిద్దమౌతోంది. అలాగే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న జెనీలియా, రామ్ చరణ్ ల 'ఆరంజ్" కూడా ఆడియో విడుదలకు ముస్తాభవుతోంది. ఇంకా జెనీలియా విజయ్‌ హీరోగా రూపొందుతున్న తమిళ చిత్రం 'వేలాయుధం"లో హీరోయిన్‌గా నటిస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X