»   »  ఎమేజింగ్ : రిపోర్టర్ కు పవన్ గిఫ్ట్, మూడు భాషల్లో సంతకం

ఎమేజింగ్ : రిపోర్టర్ కు పవన్ గిఫ్ట్, మూడు భాషల్లో సంతకం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: పవన్‌కల్యాణ్‌ హీరోగా బాబి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌'. కాజల్‌ హీరయిన్ గా చేస్తున్న ఈ చిత్రం హిందీలోనూ భారీగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ హిందీలోనూ గట్టిగా చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా పవన్ హిందీ రిపోర్టర్స్ కు ఇంటర్వూలు ఇస్తున్నాడు.

ఇప్పటికే బాలీవుడ్ ఫిలిం రిపోర్టర్ అనుపమ చోప్రాకు సర్దార్ సెట్ లోనే ఇంటర్వ్యూ ఇచ్చిన పవన్, మరో హిందీ విలేకరి అజయ్ బ్రహ్మత్మజ్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

Pawan kalyan gift to ajay brahmatmaj

ఈ సందర్భంగా అజయ్ కి పవన్ ఓ గుర్తుండిపోయే గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన అజయ్, పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశాడు.

అంతేకాదు తన చేసిన ఇంటర్య్వూ జాగరన్ న్యూస్ లో పబ్లిష్ అయిన విషయాన్ని కూడా తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేశారు అజయ్ బ్రహ్మత్మజ్. ఆ ట్వీట్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఈ సినిమా ప్రమోషన్ విషయంలో పవన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉండే పవన్, ఈ సారి మాత్రం ఇక్కడ టీవీ చానల్స్ కు ఇంటర్య్యూలు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

మరో ప్రక్క ...ఒక్కడివే ఏం చేస్తావురా..? 'ఒక్కడినే.. ఒక్కడినే.. ఎక్కడికైనా ఇలానే వస్తా.. ఇలాగే ఉంటా.. జనంలో ఉంటా.. జనంలా ఉంటా..' ఇది పవన్‌ కల్యాణ్‌ తాజా చిత్రంలోని పవర్‌ఫుల్‌ డైలాగ్‌. ఇటీవల విడుదల చేసిన 'సర్దార్‌..' ట్రైలర్‌ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది.

Pawan kalyan gift to ajay brahmatmaj

పవన్‌ స్టామినాకు తగ్గట్లుగా చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ను చూస్తేనే అర్థమవుతోంది. ఏప్రిల్‌ 8న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహకాలు చేస్తోంది. శరత్‌ మరార్‌ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చారు.

English summary
Ajay Brahmatmaj revealed he got a special gift from Pawan Kalyan. He even promised to share the photograph of it to the fans within a day. Keeping his promise, The Film Editor posted a picture of page on which Pawan's signature could be found in Hindi, English and Telugu with the message 'With Love'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu