»   » అంకిత భావం అంటే అదే: పవన్ కళ్యాణ్ హోం వర్క్

అంకిత భావం అంటే అదే: పవన్ కళ్యాణ్ హోం వర్క్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఏ పని చేసినా అంకిత భావంతో చేసినపుడే మంచి ఫలితాలు సాధించ గలుగుతాం. ముఖ్యంగా సినిమాల విషయంలో కచ్చితత్వంతో ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను నటిస్తున్న 'గోపాలా గోపాలా' చిత్రం కోసం ఇంటి వద్ద హోం వర్క్ కూడా చేస్తున్నాడట.

హోం వర్క్ చేయాల్సిన అవసరం ఏముందని అనుకుంటున్నారా? ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ భగవంతుడైన గోపాల కృష్ణుడి పాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పాత్ర పవన్ కళ్యాణ్ తన కెరీర్లో ఇదివరకెప్పుడూ చేయలేదు. ఇతర సినిమాల మాదిరి ఈ పాత్ర చేస్తే కుదరదు. బాడీ లాంగ్వేజ్, ఇతర విషయాల్లో చాలా వేరియేషన్ చూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద హోం వర్క్ (ప్రాక్టీస్) చేస్తున్నాడట. రేపు సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుండి పొగడ్తలు, విమర్శకుల నుండి ప్రశంసలు అందుకోవాలంటే ఈ మాత్రం చేయాల్సిందే. పవన్ కళ్యాణ్ కష్టానికి తగిన పలితం దక్కాలని ఆశిద్దాం.

Pawan Kalyan hard work for Gopala Gopala

వెంకటేష్, పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ వేగం పుంజుకుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ కూడా షూటింగులో జాయిన్ కావడంతో ఫుల్ స్వింగ్‌తో పనులు జరుగుతున్నాయి. ఈచిత్రాన్ని అక్టోబర్ 23న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రాన్ని 'సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియ, ఉమేష్ శుక్ల, స్క్రీన్ ప్లే: కిషోర్ కుమార్ పార్ధసాని, భూపతి రాజా, దీపక్ రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు : సాయి మాధవ్, సంగీతం : అనూప్ రూబెన్స్, పాటలు : చంద్ర బోస్, ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, కొరియో గ్రఫీ : సుచిత్ర చంద్రబోస్, కో డైరెక్టర్స్ : పూసల రాధాకృష్ణ, వై.శ్రీనివాస రెడ్డి, ప్రొడక్షన్ ఎగ్జి క్యుటివ్స్ : వీరేన్ తంబి దొరై, భాస్కర రాజు, అభిరామ్, దర్శకత్వం: డాలి.

English summary
It is known that Pawan is playing the role of modern-day Lord Krishna in Gopala Gopala. Since he has never done such roles in the past, Pawan is working on his body language and his dialogue delivery.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu