twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓటేయరని ముందే తెలుసు.. 15 నిమిషాల్లోనే మర్చిపోయా.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్

    |

    Recommended Video

    'Took 15 Mins To Recover From Poll Defeat' Says Pawan Kalyan || Filmibeat Telugu

    సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ రాణించాలని భావించారు. ఈ మేరకు జనసేన పార్టీ ద్వారా జనంలోకి వెళ్లి ఊహించని షాక్ తిన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన, ఆయన పార్టీ నేతలు ఘోర పరాజయం చెందటం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇక పవన్ రాజకీయాలను స్వస్థి చెప్పి మళ్ళీ సినిమాలు చేసుకుంటాడని ప్రచారాలు చేశారు. అయితే పవన్ మాత్రం తన పూర్తి సమయాన్ని రాజకీయాల్లోనే కేటాయిస్తానని చెప్పారు. అయినా రూమర్స్ ఆగకపోవడంతో తాజాగా అమెరికాలో జరుగుతున్న తానా మహాసభల్లో ఆసక్తికరంగా మాట్లాడుతూ చురకలంటించారు పవన్. వివరాల్లోకి పోతే..

    ఉత్తర అమెరికాలో తానా మహాసభలు

    ఉత్తర అమెరికాలో తానా మహాసభలు

    ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహా సభలు జులై 4 నుంచి వాషింగ్టన్‌ డీసీలో జరుగుతున్నాయి. ఈ సభలకు పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు సినీ ప్రమఖులు హాజరై సందడి చేస్తున్నారు. ఈయనతో పాటు దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి, తమన్, పూజా హెగ్డే తానా సభల్లో మెరవనున్నారు.

    ఓటమిపై షాకింగ్ కామెంట్స్

    ఓటమిపై షాకింగ్ కామెంట్స్

    ఈ రోజు తానా సభలకు హాజరైన పవన్ కళ్యాణ్ అందరూ ఊహించినట్లుగానే ఆసక్తికరంగా మాట్లాడారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన పవన్.. మొదటిసారి తన ఓటమి పై స్పందించారు. వేదికపై మాట్లాడిన పవన్ తన ఓటమి గురించి మరిచిపోవడానికి కేవలం 15 నిమిషాలు మాత్రమే పట్టిందని అన్నారు.

    పిరికి వాళ్ళే కారణాలు వెతుకుతారు

    పిరికి వాళ్ళే కారణాలు వెతుకుతారు

    ఓటమి కారణాలు వెతికేది కేవలం పిరికి వాళ్ళే అని, ధైర్యంగా నిలబడే వ్యక్తి ఆ ఓటమిని గుణపాఠంగా తీసుకొని రేపటి గెలుపు గురించి ఆలోచిస్తాడని పవన్ అన్నాడు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓటమి పాలైనందుకు ఏ మాత్రం డిసప్పాయింట్ కావడం లేదని, వచ్చే ఎన్నికల కోసం పకడ్బందీగా కసరత్తులు చేస్తానని పవన్ పేర్కొన్నాడు.

    వాళ్లంతా ఓటేయరని నాకు ముందే తెలుసు

    వాళ్లంతా ఓటేయరని నాకు ముందే తెలుసు

    తాను జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్తే వేల సంఖ్యలో జనం తరలిరావడం చూసి పవన్ గెలుపు ఖాయం అని కొందరు భావించారని అన్నారు. అయితే అలా వచ్చిన వారంతా ఓటేయరని తనకు ముందే తెలుసని చెప్పి ఆశ్చర్యపరిచారు పవన్ కళ్యాణ్. తాను స్కాములు చేయడానికి రాజకీయాల్లోకి రాలేదని, ప్రజా సేవనే తన ధ్యేయమని ఈ సందర్బంగా ఆయన అన్నారు.

    అప్పుడు వెయిట్ చేశాను ఇప్పుడు చేయలేనా?

    అప్పుడు వెయిట్ చేశాను ఇప్పుడు చేయలేనా?

    తాను సినిమాలు చేస్తున్న సమయంలో ఖుషీ సినిమా తర్వాత చాలా కాలం ఎదురుచూస్తే అప్పుడు 'గబ్బర్ సింగ్' రూపంలో సక్సెస్ తన ఖాతాలో పడిందని చెప్పిన ఆయన.. అప్పుడు వెయిట్ చేశాను ఇప్పుడు చేయలేనా? అని అన్నారు. సినిమాల్లో విజయం కోసం ఎలాగైతే తాపత్రయ పడ్డానో అదేవిధంగా రాజకీయాల్లో కూడా సుదీర్ఘ కాలం గెలుపు కోసం కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు.

    ఇక సినిమాల్లోకి రానట్లే లెక్క

    ఇక సినిమాల్లోకి రానట్లే లెక్క

    పవన్ కళ్యాణ్ తాజా స్పీచ్ ప్రకారం.. ఆయన సినిమాల్లోకి రావడం లేదని మరోసారి బల్లగుద్ది చెప్పారని స్పష్టమవుతోంది. చావైనా, రేవైనా రాజకీయాల్లోనే ఉంటానని ఆయన స్పష్టం చేయడం మెగా అభిమానులు ఖుషీ చేస్తోంది. దీంతో పవన్ రాజకీయ జీవితానికి మరోసారి ఘన స్వాగతం పలుకుతున్నారు జన సైనికులు.

    English summary
    JanaSena Head Pawan Kalyan attended TANA 2019 meetings and says about his loosing in Assembly elections. The people shocked to hearing Pawan Kalyan comments at TANA 2019 Summit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X