»   » సర్దార్ పెద్ద ప్లాప్... పవన్ కళ్యాణ్ రెండు రూపాయల స్టార్!

సర్దార్ పెద్ద ప్లాప్... పవన్ కళ్యాణ్ రెండు రూపాయల స్టార్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం హిందీలో రిలీజ్ చేస్తున్నారని ప్రకటించడమే ఆలస్యం బాలీవుడ్ కి చెందిన కమల్ ఆర్ ఖాన్.... పవన్ కళ్యాణ్‌ను కించ పరుస్తూ పలు ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ బాక్సాఫీసు వద్ద తెలుగులో సైతం మిక్డ్స్ టాక్ తెచ్చుకోవడం, ఇది సూపర్ హిట్ సినిమా కాదని తేలి పోవడంతో తెగ సంబర పడిపోతున్నాడు.

సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం విడుదలైన తరువాత అభిప్రాయాలు చెప్పాలని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ, కమాల్ ఖాన్ తో పాటు, వరుణ్ తేజ్, హరీశ్ శంకర్ ల అభిప్రాయాలను కూడా కోరగా, వాళ్లిద్దరూ ఇంకా స్పందించలేదు గానీ, కమల్ ఆర్ ఖాన్ మాత్రం తన సమాధానంతో రెచ్చిపోయాడు.


'నేను ఇంత కాలం హిందీ రిలీజ్ గురించి మాట్లాడాను...హిందీ గురించి మరచిపోండి. సర్దార్ గబ్బర్ సింగ్ తెలుగులో కూడా ఆల్ టైం ఫ్లాప్ సినిమా అని నాకు రిపోర్టులు వస్తున్నాయి. ప్రజలు అలానే అంటున్నారు. సార్... మీ సినిమా ఫ్లాప్ తో మీరు ఇపుడు రెండు రూపాయల స్టార్ అయిపోయారు. ప్రజలు మీ చిత్రాన్ని 'సర్ దర్ద్ గబ్బర్ సింగ్' అని పిలుస్తున్నారు సార్. ఇక నేను తీస్తున్న దేశద్రోహి-2లో నటిస్తే మరోసారి సూపర్ స్టార్ గా ఎదగొచ్చు" అంటూ కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ చేసారు.


స్లైడ్ షోలో కమల్ ఆర్ ఖాన్ చేసిన ట్వీట్స్...


బిగ్గెస్ట్ ప్లాప్ రిపోర్ట్స్

బిగ్గెస్ట్ ప్లాప్ రిపోర్ట్స్

తెలుగు నుండి సర్దార్ గబ్బర్ సింగ్ బిగ్గెస్ట్ ప్లాప్ అని రిపోర్ట్స్ వస్తున్నాయి, దీన్ని అందరూ సర్ దర్ద్ గబ్బర్ సింగ్ అంటున్నారంటూ ట్వీట్.


నువ్వు రెండు రూపాయల స్టార్

నువ్వు రెండు రూపాయల స్టార్

పవన్ కళ్యాణ్ 2 రూపాయల స్టార్ అంటూ కమల్ ఆర్ ఖాన్ ట్వీట్.


ఫస్ట్ డే..

ఫస్ట్ డే..

సర్దార్ గబ్బర్ సింగ్ హిందీలో ఫస్ట్ డే కేవలం రూ. 45 లక్షలు మాత్రమే వచ్చాయంటూ ట్వీట్.


సర్దార్ క్రాష్

సర్దార్ క్రాష్

సర్దార్ బక్సాఫీసు వద్ద క్రాష్ అయిందంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేసిన ఖాన్.


English summary
KRK tweeted that negative reviews are coming for not only Hindi but also for Telugu version. He termed Pawan a 2 Rs star.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu