»   »  'రాంబాబు' వివాదానికి పవన్ దూరం...అసలు కారణం

'రాంబాబు' వివాదానికి పవన్ దూరం...అసలు కారణం

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కెమెరామన్ గంగతో రాంబాబు' . పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ కొత్త చిత్రం వివాదంలో పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే సన్నివేశాలున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తడంతోపాటు దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నైజాంలో ఈ చిత్ర పంపిణీదారు దిల్‌రాజుల కార్యాలయాలపై దాడులు సైతం జరిగాయి. అయితే ఈ విషయంలో ఎక్కడా పవన్ కళ్యాణ్ కలగచేసుకోలేదు. అలాగే వివాదానికి కావాలనే దూరంగా ఉన్నారంటూ విమర్శలు వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ ఎందుకలా చేసారు..ఇన్నాళ్లూ మీడియాకు సైతం దొరక్కుండా ఎక్కడున్నారు.

  ఇంత వివాదం జరుగుతున్నా పవన్ ఎందుకు బయిటకు రాలేదు అంటే అసలు ఆయన దేశంలోనే లేరు. సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఆయన యారప్ కి టూర్ కి వెళ్ళారు. ఆదివారం మళ్లీ ఆయన సిటీకి వచ్చారు. అయితే ఈ రెండు వారాలు అక్కడ నుంచే ఆయన ఈ వివాదం ముదరకుండా మానిటర్ చేసారని సమాచారం. దిల్ రాజుకు,పూరి జగన్నాధ్ కి ఫోన్ లో టచ్ లో ఉన్న పవన్ అవసరమైన జాగ్రత్తలతో కూడిన సలహాలతో ఈ వివాదం ఇంకా పెరగకుండా ఫుల్ స్టాప్ పెట్టగలిగారని చెప్తున్నారు. తను కలగ చేసుకుంటే సున్నితమైన ఈ వివాదం ఇంకా పెద్దదవుతుందనే ఆయన దూరంగా ఉన్నారని తెలుస్తోంది.

  'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'. రిలీజైన రోజు డివైడ్ టాక్ తెచ్చుకున్నా రెండో రోజుకి వావాదం వెనకేసుకోవటంతో డిస్ట్రిబ్యూటర్స్ లో కొత్త ఆశలు చిగురించాయి. దాంతో ఆంధ్ర ప్రాంతంలో కలెక్షన్లకు లోటు లేకుండా పోయింది. దానికి తోడు పోటీగా మరుసటి రోజే దసరా కానుకగా వస్తుందనుకున్న నాగార్జున డమరుకం కాస్తా తెలియని తేదీకి వాయిదా అయపోవడం రాంబాబుకు కలిసి వచ్చిన అంశం. వారం రోజులు కలెక్షన్లు బాగానే అందుకుంది.

  ఇక తెలంగాణా ప్రాంతంలో వివాదం సద్దుమణిగాక కలెక్షన్లు పెద్దగా పుంజుకోలేదు కానీ, కొంచెం నయమే అంటున్నారు. మరో ప్రక్క మంచు విష్ణు దేనికైనా రెడీ ఈ వారం విడదల అయ్యింది. కథ, కథనాలు పెద్దగా కొత్తవి కాకపోయనా , సినిమా కామెడీగా సాగడంతో, కలెక్షన్లు బాగానే వుండే అవకాశం వుందని ట్రేడ్ లో అంచనాలు వేస్తున్నారు. ఈ ప్రభావం రాంబాబుపై పడినా ఆశ్చర్యపోనక్కరలేదని చెప్తున్నారు. ఇక వచ్చేవారం పెద్ద సినిమా విడుదల ఏదీ లేకపోవడంతో, రాంబాబు, దేనికైనా రెడీలకు పెద్దగా ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదని అంటున్నారు.

  English summary
  
 After wrapping up the entire shoot and dubbing of CGR, Pawan flew to Europe for a two weeks vacation with his family. For the past few weeks he wasn't in the city and just Sunday he landed in Hyderabad. Sources say, Pawan hadn't reacted to the controversy because he doesn't want to make it a bigger issue, but has been in constant touch with Director Puri & Nizam Distributor Dil Raju, and done everything he could to bring back the situation to normalcy.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more