»   » అవునూ... పవన్ ని మళ్లీ ఎందుకు పొగిడాడు?

అవునూ... పవన్ ని మళ్లీ ఎందుకు పొగిడాడు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :రామ్ గోపాల్ వర్మ అంటేనే కాంట్రవర్శికి మారు పేరుగా నిలుస్తారు. అలాంటిది ఇప్పుడు కారణం లేకుండా పవన్ ని పైకి ఎత్తేసారు పి.కళ్యాణ్ ఇస్ గ్రేటర్ దేన్ ది గ్రేటర్ ఆఫ్ ది గ్రేటేస్ట్..అంటూ ట్వీట్ చేసాడు.ఇక్కడ మీరు చూడండి.

ఈ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించిన కామెంట్స్ తన ట్విట్టర్ ద్వారా తరచూ చేస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగానే వర్మ తన ట్విట్టర్ ద్వారా అనేక వివాదాలకు తెరలేపారు. అందులో చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి కూడా వివాదాస్పద కామెంట్స్ కూడా అనేకం ఉన్నాయి.

అయితే ఈ మధ్య కాలంలో చిరంజీవిని, పవన్ కళ్యాణ్ గురించి వర్మ వరుస ట్వీట్లు చేయడం పలువురుని ఆశ్చర్యానికి గురి చేసింది. వర్మ కావాలనే వారిద్దరినీ టార్గెట్ చేస్తున్నారని కొందరి ఆరోపణ. అయితే వర్మ వాదన మాత్రం మరోలా ఉంది. వారికి తాను అభిమానిని, అభిమానిగా తన మనసులోని మాటను మాత్రమే వెల్లడిస్తున్నాను అన్నారు. టీవీ ఇంటర్వూలో వర్మ స్పందిస్తూ...తాను చిరంజీవి సినిమాలను, టికెట్ కొనుక్కుని చూసేవాడినని... అప్పటి నుంచే తాను చిరంజీవికి పెద్ద అభిమానినని చెప్పాడు.

పవన్ కల్యాణ్ సినిమాలను తాను ఎక్కువగా చూడలేదని... కానీ, పవన్ వ్యక్తిగతంగా చాలా గొప్పవాడని, అందుకే ఆయనకు తాను అభిమానిని అయ్యానని తెలిపాడు. జనసేన ప్రారంభించినప్పుడు కానీ, ఆ తర్వాత అనేక సందర్భాల్లో కాని పవన్ మాట్లాడినప్పుడు ఆయనలో పెల్లుబికిన భావాలు అద్భుతమని చెప్పిన సంగతి తెలిసిందే..

Pawan Kalyan is the greatest!

చిరంజీవి గురించి వర్మ చేసిన ట్వీట్లలో ఎక్కువగా ఆయన 150వ సినిమా గురించే ఉండటం గమనార్హం. చిరంజీవి అభిమానిగా తాను ఆయన 150వ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను అని, అది బాహుబలి సినిమాను మించి పోయేలా ఉందని వర్మ ఆ మధ్య వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ గురించి వర్మ చేసే ట్వీట్లు ఎక్కువగా పవన్ జనసేన పార్టీ, ఆయన రాజకీయాల్లోకి రావడం గురించే ఉంటోంది. చాలా మంది అభిమానులు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నట్లే వర్మ కూడా ఆయన రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలని కోరుకుంటున్నారు.

English summary
Ram Gopal Varma ‏tweeted: "P Kalyan is greater than the greater of the greatest"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu