»   » పవన్‌ కళ్యాణ్‌పై డౌట్: మాల్దీవుల్లో మాజీ భార్య, పిల్లలతో...?( ఫోటోస్)

పవన్‌ కళ్యాణ్‌పై డౌట్: మాల్దీవుల్లో మాజీ భార్య, పిల్లలతో...?( ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యాతో కలిసి మాల్దీవుల్లో హాలిడే ఎంజాయ్ చేసారు. మాల్దీవుల వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలు రేణు దేశాయ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు.

రేణు దేశాయ్ పోస్టు చేసిన ఓ ఫోటోలో అకీరా లుంగీలో కనిపించడం.... పొడవులో తల్లి రేణు దేశాయ్ ని మించి పోవడం గమనార్హం. ఈ ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో ఇంటర్నెట్లో వైరల్ లా వ్యాపించాయి.

అకీరా లుక్ చూసి అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. అకీరా సూపర్బ్ గా ఉన్నాడని...పవన్ కళ్యాణ్ వారసుడు, కాబోయే బుల్లి పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ కామెంట్ల రూపంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం రేణు దేశాయ్, పిల్లలు మాల్దీవుల్లో ఉన్నారా? లేక కొన్ని రోజుల క్రితం నాటి ఫోటోలను ఆమె ఇప్పుడు పోస్టు చేసారా? అనేది తెలియడం లేదు.

ఆ మధ్య పవన్ కళ్యాణ్ మాల్దీవులకు సింగిల్‌గా వెకేషన్ వెళ్లారు. ఆ సమయంలో ఎయిర్ పోర్టులో ఫోటోగ్రాఫర్లకు చిక్కారు. అయితే పవన్ ఒంటరిగానే కనిపించడంతో ఎవరికీ అనుమానం రాలేదు. ప్రస్తుతం రేణు దేశాయ్ మాల్దీవుల ఫోటోలు పోస్టు చేయడం చూస్తే.... పవన్ కళ్యాణ్ కూడా వారితో పాటు మాల్దీవుల్లో గడిపారా? అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

స్లైడ్ షోలో ఫోటోలు...

మాల్దీవుల్లో..

మాల్దీవుల్లో..

రేణు దేశాయ్ తాజాగా పోస్టు చేసిన మాల్దీవుల వెకేషన్ పిక్. ఇందులో అకీరా లుంగీలో ఉండటం చూడొచ్చు. హైట్ విషయంలో కూడా రేణును మించి పోయాడు.

సూపర్

సూపర్

మాల్దీవుల్లో క్లైమేట్ సూపర్ గా ఉందంటూ రేణు దేశాయ్ పోస్టు చేసిన పిక్.

పవన్ కళ్యాణ్?

పవన్ కళ్యాణ్?

కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ మాల్దీవులకు వెళ్లారు. ఆ సమయంలో రేణు, ఇద్దరు పిల్లలు కూడా ఆయనతో ఉన్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

విడిపోయారు కానీ ఫ్రెండ్సే..

విడిపోయారు కానీ ఫ్రెండ్సే..

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోయిన సంగతి తెలిసిందే. భార్య భర్తలుగా విడిపోయినా ఇద్దరి మధ్య స్నేహం మాత్రం అలానే ఉంది. తమ పిల్లలకు మంచి అమ్మానాన్నలుగా కొనసాగుతున్నారు.

English summary
Renu Desai treated Pawan Kalyan fans with a special picture from their recent vacation to Maldives. The mother of two posted a picture of hers with Kids Akira Nandan and Aadhya from a serene site in Maldives and it obviously took no time to go viral. Akira Nandan was spotted sporting a 'lungi' at the pool side, with an amazing beach view and Pawan Kalyan fans were all thrilled to see Akira grown up, even crossing the shoulders of his mother.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu