»   » పవన్ తో కొరటాల సినిమా లేనట్టేనా... ఫ్యాన్స్ నిరాశ

పవన్ తో కొరటాల సినిమా లేనట్టేనా... ఫ్యాన్స్ నిరాశ

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ సినిమాల సెలక్షన్ అందరికీ భలే షాక్ ఇస్తోంది. పవన్ లాస్ట్ మూవీ కాటమరాయుడు.. అజిత్ నటించిన వీరమ్ కు రీమేక్ అనే సంగతి తెలిసిందే. తెలుగులో వీరుడొక్కడే పేరుతో ఈ చిత్రం రిలీజ్ అయినా సరే.. దాని రూపురేఖలు మార్చేసి మరీ రీమేక్ చేసేశాడు పవర్ స్టార్. మరీ ఒక రేంజ్ లో కాకపోయినా పవన్ కళ్యాణ్ అన్న బ్రాండ్ ఇమేజ్ తో హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు మళ్ళీ అదే ప్రయోగం చేయబోతున్నాడట పవన్.

వేదాలం చిత్రాన్ని కూడా రీమేక్

వేదాలం చిత్రాన్ని కూడా రీమేక్

త్వరలో త్రివిక్రమ్ తో సినిమా ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్న పవన్.. అజిత్ నటించిన వేదాలం చిత్రాన్ని కూడా రీమేక్ చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు ఆర్టీ నేసన్ దీన్ని రూపొందించనున్నాడు. అంటే.. కాటమరాయుడుతో కలిపి పవన్ మొత్తం 4 ప్రాజెక్టులు చేస్తుండగా.. వీటిలో 3 తమిళ్ రీమేక్స్ అన్నమాట.

కొరటాల శివ డైరెక్షన్లో

కొరటాల శివ డైరెక్షన్లో

ఇప్పుడు చేస్తున్న సినిమా అయిపోయిన వెంటనే నేసన్ దర్శకత్వం లో సినిమా మొదలవుతుందన్నమాట. ఆ సినిమా తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నట్టు టాక్ వినిపించింది. పవన్‌తో సినిమాకు సంబంధించి కొరటాల ఓ శక్తిమంతమైన కాన్సెప్ట్‌ను తయారు చేసినట్టు, ఆ కథ కూడా పవన్‌కు చాలా నచ్చినట్టు కథనాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సినిమా ఉంటుందో ఉండదో అన్న అనుమానాలు మొదలయ్యాయ్...

ఏడాదిన్నర పడుతుంది

ఏడాదిన్నర పడుతుంది

త్రివిక్రమ్ సినిమా, ఆర్టీ నేశన్ సినిమాలు పూర్తయ్యే సరికి ఎలా లేదన్నా ఓ ఏడాదిన్నర పడుతుంది. అంటే 2018 పూర్తైపోతుంది. ఆ తర్వాత 2019లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న పవన్ కల్యాణ్.. కొరటాల శివ సినిమాపై వెనకడుగు వేస్తున్నాడట.

కథ చేయాలని ఉన్నా

కథ చేయాలని ఉన్నా

ఆ సినిమా ఒప్పుకొంటే ఎన్నికల మీద దృష్టి సన్నగిల్లుతుందని భావిస్తున్నాడట. అందుకే కథ నచ్చినా.. కథ చేయాలని ఉన్నా.. ఎన్నికల దృష్ట్యా అప్పటి పరిస్థితులని బట్టి ఆలోచిద్దాం అని కొరటాలకు చెప్పినట్టు ఫిల్మ్‌నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. 3 నెలల్లో సినిమా తీస్తానని కొరటాల మాటిచ్చినా.. ప్రస్తుతానికైతే ఆ రెండు సినిమాలు పూర్తవ్వాలని, ఆ రెండు త్వరగా అయిపోతే ఆలోచిద్దామని కొరటాలకు పవన్ సూచించినట్టు చెబుతున్నారు.

English summary
New Buzz is roming in Filim nagar circles that Pawan kalyan-Koratala combo project is cancelled
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu