మేనల్లుడి కోసం పవన్ కళ్యాణ్ వస్తాడా?
హైదరాబాద్: తెలుగులో పాపులర్ సినిమా స్టార్‌గా ఎదిగిన పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే ఎలాంటి కార్యక్రమానికి అయినా భారీ రెస్పాన్స్ వస్తుంది. ఆయన పట్ల ఉండే క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయన్ను చాలా మంది పలు కార్యక్రమాలకు ఆహ్వానిస్తుంటారు. ఆ మధ్య తన అభిమాని నితిన్ మూవీ 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రానికి పవన్ కళ్యాణ్ రావడంతో సినిమాకు భారీగా పబ్లిసిటీ జరిగింది.
పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మూవీ 'రేయ్' చిత్రం ఆడియో వేడుక జరుగనుంది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరైన సీడీలను ఆవిష్కరించనున్నట్లు సమాచారం. డిసెంబర్ 8న జరిగే ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులు హాజరయ్యే అవకాశం ఉంది.

బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో 'రేయ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ లేటైనా ట్రేడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ చిత్రం గురించి వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ 'ఇటీవలి కాలంలో యూత్‌ని టార్గెట్ చేస్తూ క్లాస్, ఫాస్ట్‌ఫుడ్ తరహా లవ్‌స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే 'దేవదాసు', 'దేశముదురు' తరహాలో భారీ స్థాయి మాస్, యూత్ లవ్‌స్టోరీలు రావడంలేదు. ఆ లోటుని తీర్చేవిధంగా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రీతిలో 'రేయ్' తయారవుతోంది. కథానుగుణంగా ఈ చిత్రం ప్రథమార్థం వెస్టిండీస్ సంస్కృతి నేపథ్యంలో, ద్వితీయార్థం అమెరికా సంస్కృతి నేపథ్యంలో ఉంటుంది.

ఎఫ్.డి.సి. నిబంధనలకనుగుణంగా అమెరికా, వెస్టిండస్‌లో కొంత భాగం, హైదరాబాద్‌లో అత్యధిక భాగం షూటింగ్ చేశాం. భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికరమైన కథాకథనాలతో పాటు అద్భుతమైన వినోదంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. తొలి సినిమాతోనే సాయిధరమ్ తేజ్ కచ్చితంగా స్టార్ హీరో అవుతాడనే నమ్మకం ఉంది. అలాగే సయ్యామి ఖేర్ తన అందంతో యూత్‌ని ఆకట్టుకుంటుంది. శ్రద్ధాదాస్ పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. ఇక పాటలన్నీ సందర్భోచితంగా, నాదైన గ్రాండియర్ స్టయిల్‌లో ఆకట్టుకుంటాయి' అని తెలిపారు.


Click it and Unblock the Notifications











