»   » పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ఆ బాలీవుడ్ రీమేకా!?

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ఆ బాలీవుడ్ రీమేకా!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హిందీలో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొనె జంటగా నటించిన 'లవ్ ఆజ్ కల్" విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం రీమేక్ లో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్నట్లు తెలియవచ్చింది. గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయభాస్కర్ దర్శకత్వం వహించనున్నారు. దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు రాస్తున్నారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన'జై చిరంజీవ", నువ్వే కావాలి, మల్లీశ్వరీ, బలాదుర్" చిత్రాలన్నీ విజయాన్ని సాధించాలు.

ఆ తర్వాత కొద్దకాలం పాటు వీరిద్దరూ విడివిడిగా చిత్రాలు చేయడంతో పాటు త్రివిక్రమ్ దర్శకుడిగా కూడా మారారు. దాంతో వీరిద్దరికీ విజయావకాశాలు సన్న గిల్లాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఎస్ జె సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాన్ 'కొమరం పులి" చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ఇంకా పూర్తికావాల్సి ఉంది.

అయితే జెమిని ఫిల్మిం సర్యూట్ మరియు గీతా ఆర్ట్స్ బాలీవుడ్ చిత్రం '3 ఇడియట్స్"చిత్రానికి రీమేక్ హక్కులకు ట్రై చేసిన రీమేక్ హక్కులను అల్లు అరవింద్ స్వంతం చేసుకొన్న విషయం తెలిసిందే. మరియైతే ఇప్పుడు 'లవ్ ఆజ్ కల్" రీమేక్ కొరకు జెమిని ఫిల్మిం సర్యూట్ ట్రై చేస్తున్నది. అదే టైంలో పవన్ కళ్యాణ్ డేట్స్ కొరకు ప్రయత్నిస్తున్నాట్లు సమాచారం. అయితే దీనికి తెరదించుతూ ఈ తాజా చిత్రాన్ని పరమేశ్వరి ఫిల్మిం బ్యానర్ లో ఈ నెల 29న లాంఛనంగా ప్రారంభించడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu