»   » పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ఈ రోజే మొదలైంది

పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ఈ రోజే మొదలైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్, జయింత్ పరాంన్జీ కాంబినేషన్ లో రానున్న తాజా చిత్రం ప్రారంభం ఈరోజు(మార్చి 29న) ఉదయం హైదరాబాద్ లోని హోటల్ తాజ్ కృష్ణలో మొదలైంది. గ్రాండ్ గా జరిగిన ఈ పంక్షన్ లో ఎంపి బొత్సా ఝాన్సి క్లాప్ కొట్టి ప్రారంభించింది. అలాగే గోవా గుట్కా యజమాని కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఇక ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ...గత రెండేళ్ళుగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళకు నా కల నెర వేరింది, మెటీరియలైజ్ అయ్యింది అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఇది ఎక్సపెన్సివ్ చిత్రం. అలాగే ఇంత అని బడ్జెట్ కంట్రోల్ పెట్టుకోలేదు. ఓ బ్లాక్ బస్టర్ ఇస్తానని హామీ ఇస్తున్నాను అన్నారు.

దర్శకుడు జయంత్ పరాంన్జీ మాట్లాడుతూ...ఇది హిందీ చిత్రం లవ్ ఆజ్ కల్ కి రీమేక్. ఆ చిత్రంలోని మెయిన్ ధీమ్ ని తీసుకుని సీన్స్ ని ప్రెష్ గా అల్లుకున్నాం. త్రివక్రమ్ స్క్రిప్టు పై రాస్తున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ నిజజీవితంలోనూ సెన్సిటివ్ హ్యూమన్ బీయింగ్. అది తెరపై కనపడుతుంది. బావగారు బావున్నారా సమయంలో పవన్ తో ఓ స్క్రిప్టుకి పని చేసాను. అయితే అది మెటీరియలైజ్ కాలేదు. దాదాపు పన్నెండు ఏళ్ళపాటు ఈ మా కాంబినేషన్ కోసం వెయిట్ చేసాను. నా జీవితంలో ఈరోజులు చాలా ఆనందకరం అన్నారు.

ఇక లవ్ ఆజ్ కల్ అనే హిందీ చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు అందిస్తున్నారు. అలాగే మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ రీమేక్ కి వినోద్ ప్రధాన్ కెమెరా అందిస్తున్నారు. గణేష్ నిర్మాతగా బడే రవి సమర్పకుడుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu