»   » రూ. 1000 కోట్ల బాహుబలి: పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు, మహేష్ బాబు కూడా!

రూ. 1000 కోట్ల బాహుబలి: పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు, మహేష్ బాబు కూడా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రూ. 1000 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినీ పరిశ్రమలో చరిత్ర సృష్టించిన బాహుబలి-2 సినిమా, చిత్ర బృందంపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు గుప్పించారు. వరుస ట్వీట్లు చేస్తూ దర్శకుడు రాజమౌళి, నటీనటులను అభినందించారు.

తన ట్వీట్లలో పవన్ కళ్యాణ్ దర్శకుడు రాజమౌళితో పాటు, ప్రభాస్ తదితరులను శ్రీ అని సంబోధించడం విశేషం. బాహుబలి టీం తెలుగు సినిమా గర్వపడేలా చేసారని ఆయన తన ట్విట్ల ద్వారా చెప్పే ప్రయత్నం చేసారు.

మరో వైపు మహేష్ బాబు స్పందిస్తూ... రాజమౌళి అండ్ టీం నాతో పాటు తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం గర్వపడేలా చేసారు అంటూ ట్వీట్ చేసారు.

హృదయపూర్వకంగా...

భారీ విజయం సాధించి రూ. 1000 కోట్ల వసూల్లు సాధించిన సందర్బంగా బాహుబలి దర్శకుడు శ్రీ రాజమౌళి, శ్రీ ప్రభాస్ మరియు చిత్ర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసారు.

గర్వపడేలా చేసారు

సంత్సరాల తరబడి శ్రీ రాజమౌళి హార్డ్ వర్క్ చేసి మనమంతా గర్వపడేలా చేసారు. ఆయన ఇలాంటి గొప్ప విజయాలు మరిన్ని సాధించాలని కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసారు.

రానా గురించి...

ఇంకా శ్రీ రానా దగ్గుబాటి, ఇతర నటీనటుల, నిర్మాతలకు, టెక్నీషియన్స్ కు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసారు.

థాంక్స్ చెప్పిన రాజమౌళి

పవన్ కళ్యాణ్ అభినందనలతో ముంచెత్తడంతో రాజమౌళి ఆనందం వ్యక్తం చేసారు. థాంక్స్ చెబుతూ ట్వీట్ చేసారు.

మహేష్ బాబు ట్వీట్

రూ. 1000 కోట్లు వసూళ్లతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. రాజమౌళి అండ్ టీం నాతో పాటు తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం గర్వపడేలా చేసారు అంటూ మహేష్ బాబు ట్వీట్ చేసారు.

English summary
"My Heartfelt congratulations to Shri Rajmouli,Shri Prabhas &team for their stupendous success of. Bahubali and achieving the 1000 crore mark. Shri Rajmouli with his years of hard work ,tenacity & dedication made alll of us proud.. I wish him many more achievements like this." Pawan Kalyan tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu