For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు

  By Staff
  |

  జయాపజయాలు వెలుగూ చీకటిలాంటివి! అది గ్రహించినవాడు విజయాన్ని తనవైపు ఈజీగా తిప్పుకొగలడు. కష్టపడే వాడు కార్యదీక్షత కలిగినవాడు చేసే పని అదే. పవన్ కళ్యాణ్ ది సరిగ్గా అటువంలటి పర్సనాలిటీయే. ప్రారంభంలో వరుసగా హిట్లు చూసి, తర్వాత కొన్ని జయాపజయాలను చవిచూనిన పవన్ మళ్ళీ ఇప్పుడు హిట్ రేసులో పరుగెడుతున్నారు.పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం నేడు(సెప్టెంబర్ 2) ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా జన్మదిన వేడుకలకు దూరంగా ఉండటం పవన్ కళ్యాణ్ కి అలవాటు. అభిమానులపై అభిమానం ఉన్నప్పటికీ బర్త్ డే పేరుతో వారికి ఆహ్వానాలు పలకడం పవన్ కి ఇష్టం ఉండదు. ఆయన సినిమాలకు శతదినోత్పవవేడుకలు చేయరు ఎందకంటే ఆయనకు సినిమా విజయం ఆనందాన్నిస్తుంది కానీ, ఆ ఆనందాన్ని పంచుకోవడానికి వేడుక ఏర్పాటు చేస్తే అందులో పాలుపంచుకోవడానికి అభిమానులు ఎక్కడెక్కడి నుండో వ్యయప్రయాసలకోర్చి వస్తారు. వారిని ఇబ్బందిపెట్టడం ఇష్టం లేదంటారు.

  రియల్ లైఫ్ లోనూ కూల్ గా వ్యవహరింగడం కళ్యాణ్ స్టయిల్. తన లైఫ్, తన సినిమాలు తప్ప ఇంకొకరి గురించి ఆలోచించడం ఆయనలో ఉండదు. పైకి కఠినమైన వ్యక్తిలా కనిపించే పవన్ కళ్యాణ్ మనసు సున్నితం అని చెప్పడానికి ఇదోక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మెగాస్టార్ తమ్ముడుగా జన్మించిన ఈ పవర్ స్టార్ అనతికాంలోనే అసంఖ్యాక తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొని ఆ 'అన్నయ్య" కు తగ్గ తమ్ముడ"గా అఖిలాంద్రకోటి ప్రజల హృదయసంహాసనాధినేత కాగలిగాడు.

  ఇంతింతై...నటుడింతై.....తానంతై...భూమికంతంతై అన్న చందాన, ఇంత వాడైన కళ్యాణ్ అంతవాడైన పవర్ స్టార్ గా ఎదిగిన వైనాన్ని, ఆయన విజయపరంపరను ఒక్కసారి అధ్యయనం చేస్తే...ఆయన మొదటి సినిమా గీతా ఆర్ట్స్ పతాకంపై ఇవివి సత్యనారాయణ నిర్థేశకత్వంలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన 'అక్కడ అబ్బాయి-ఇక్కడ అమ్మాయి" అక్కినేని మనుమరాలు సుప్రియ, పవన్ కాంబినేషన్లో నిర్మించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆయన రెండవ చిత్రం మత్యాలసుబ్బయ్య దర్శకత్వంలో 'గోకులంలో సీత" నటుడిగా ఆయన తొలి విజయం అని చెప్పుకొవాలి. ఇక పవర్ స్టార్ కెరీర్లో మైల్డ్ స్టోన్ గా నిలిచిన చిత్రం కరుణాకరణ్ 'తొలిప్రేమ" ఈ చిత్రం ఒక హిస్టరీని క్రియేట్ చేసింది.

  ఈ సినిమాలో పవర్ స్టార్ నటనకు తెలుగు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తర్వాత వచ్చిన సినిమాలు తమ్ముడు, బద్రి, ఖుషి లాంటి సినిమాలు విజయపతాకాన్ని ఎగురవేశాయి. కానీ తర్వాత తన ఆలలోచనలకి రూపంగా దర్శకునిగా రూపాంతరం చెంది తను తీర్చిదిద్దిన చిత్రం 'జానీ" ఈ చిత్రం అనుకున్నంత సక్సెస్ ను సాధించలేకపోయింది. తరువాత ఆయన నటించిన గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం చిత్రాలు ఆయన స్థాయికి తగ్గ విజయాలను సాధించలేక పోయాయి. కానీ 'జల్సా" సినిమా సంచలనం సాధించింది. ఇదే రేస్ లో ఇప్పుడు అభిమానులందరూ 'కొమరం పులి" కోసం వేయి కళ్ళతో ఎదుదుచూస్తున్నారు. నువ్వే నువ్వే, అతడు లాంటి ట్రమండస్ హిట్స్ తెలుగు ప్రజలకు అందించిన యువదర్శక, రచయిత త్రివిక్రమ శ్రీనివాస్ దర్శకత్వ సారధ్యంలో సవర్ స్టార్ ఖ్యాతిని నవఖండ....భూమండలమంతా ప్రతిధ్వనించాలని...తెలుగు వాడినీ ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పాలని, సెప్టెండర్ 2న జన్మదినం జరుపుకుంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్థిల్లాలని కొరుకుంటుంది దట్స్ తెలుగు.కామ్

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X