»   » ఇండియా టాప్ 5 లిస్టులో పవన్ కళ్యాణ్!

ఇండియా టాప్ 5 లిస్టులో పవన్ కళ్యాణ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాపులారిటీ ఏ రేంజిలో ఉందో మరోసారి రుజువైంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఇండియాలోనే మోస్ట్ డిజైరబుల్ టాప్ 10 లిస్టులో 5వ స్థానం దక్కించుకున్నాడు. టైమ్స్ ఆఫ్ న్యూయార్క్ ఇటీవల నిర్వహించిన ఆన్ లైన్ పోల్‌లో ఈ విషయం వెల్లడైంది. పవన్ కళ్యాణ్ తర్వాత మహేష్ బాబు 6వ స్థానం దక్కించుకున్నాడు.

పవన్ కళ్యాణ్ కంటే ముందు....మొదటి నాలుగు స్థానాల్లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, తర్వాత సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్‌లు నిలిచారు. తమిళ హీరో విజయ్ 7వ స్థానంలో, అమీర్ ఖాన్ 8వ స్థానంలో, 9వ స్థానంలో రణబీర్ కపూర్, 10వ స్థానాన్ని అజయ్ దేవగన్ దక్కించుకున్నాడు.

పవన్ కళ్యాణ్ తెలుగులో అతితక్కువ కాలంలో టాప్ రేంజికి ఎదిగిన హీరోల్లో ఒకరు. పవన్ మేనియా ఈ రేంజిలో వ్యాప్తి చెందడానికి కారణం కేవలం ఆయన సినిమాలు మాత్రమే కాదు, ఆయన వ్యవహార శైలి, మంచి మనసు అని చెబుతుంటారు అభిమానులు. ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ నెం.1 స్థానంలో ఉన్నాడని చెప్పొచ్చు.

పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా 'అత్తారింటికి దారేది' తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొడుతూ నెం.1 స్థానాన్ని దక్కించుకున్నాడు. దాదాపు రూ. 48 కోట్లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 78 కోట్లు వసూలు చేసింది. త్వరలోనే రూ. 100 కోట్లు వసూలు చేస్తుందని అంచనా.

English summary
Times of New York has recently conducted an online poll to know about the top 10 most desirable actors of India. Shahrukh Khan has topped the chart while Power Star Pawan Kalyan is in the 5th spot and Mahesh Babu in the sixth position. Here is the list of Top Ten Most desirable Actors of India.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu