»   » ఇదీ పవన్ కళ్యాణ్ పవర్

ఇదీ పవన్ కళ్యాణ్ పవర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ రికార్డులు క్రియేట్ చేయటం, బ్రద్దలు కొట్టడం పవన్ కి కొత్తేమీ కాదు. ఇప్పుడు పవన్ మరోసారి తన పవర్ ఏంటో చూపించంటం జరిగింది. గూగుల్ సెర్చ్ ఇంజన్ లో నెటజన్లు అత్యథింగా సెర్చ్ చేసిన సెలబ్రిటీ గా టాప్ లో నిలిచాడు. ఈ లిస్ట్ లో మరో నటి రమ్య, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున నిలబడిన కుమార్ విశ్వాస్ కూడా ముందు వరసలో ఉన్నారు.

గూగుల్ తన స్టేట్ మెంట్ లో ... ''భారతదేశ పాలిటిక్స్ లో మొదటి నుంచీ సెలబ్రిటీలది ప్రధాన పాత్ర. ముఖ్యంగా ఎన్నికల సమయం ప్రచార కార్యక్రమాల్లో వీరు పెద్ద పాత్రనే పోషిస్తున్నారు. అలాగే 16 వ లోక్ సభ ఎన్నికల బరిలో ఈ సారి పెద్ద సంఖ్యలో సెలబ్రెటిలు బరిలో నిలిచారు. వారే గూగుల్ సెర్చ్ లో ఎక్కువ సెర్చ్ చేయబడుతున్నారు" అని పేర్కొంది.

Pawan Kalyan most searched celebrity

ఇక పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ ద్వారా నేరుగా ఎలక్షన్స్ లో పాల్గొనకపోయినా కంటిన్యూగా వార్తల్లో నిలుస్తున్నారు. బిజేపి తరుపున ఆయన చేస్తున్న ప్రచారంతో అంతటా ఆయనపైనే దృష్టి ఉంది. అలాగే తెలుగుదేశానికి ఆయన సపోర్టు చేస్తారా లేదా అన్నది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉండిపోయి రోజూ గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు.

అలాగే పివిపి తో విజయవాడ ఎంపి సీట్ వ్యవహారంలో కూడా ఆయన ఎక్కువ న్యూస్ లో ఉన్నారు. మీడియా సంస్ధలన్నీ ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. మరో ప్రక్క ఆయన సినిమాలకు సంభందించిన వార్తలు కూడా ఎప్పుడూ ఆకర్షించేవే కావటం కూడా గూగుల్ సెర్చ్ కి కారణం అవుతుంది.

English summary
Pawan Kalyan is the most searched celebrity politician in the current poll season. In a statement, Google, the search engine, said topped the list.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu