»   » పవన్ కళ్యాణ్ మూవీ స్టోరీ, తన డైరెక్షన్ గురించి దాసరి ఇలా...

పవన్ కళ్యాణ్ మూవీ స్టోరీ, తన డైరెక్షన్ గురించి దాసరి ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో దర్శక రత్నగా పేరు తెచ్చుకున్న దాసరి నారాయణ రావు... త్వరలో పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా నిర్మించబోతున్న సంగతి తెలసిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన విషయాలు వెల్లడించారు.

దాసరి మాట్లాడుతూ...‘ప్రస్తుతం పవన్‌కల్యాణ్ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. బయటి కథల్ని కూడా వింటున్నాను. దర్శకుడెవరనేది ఇంకా నిర్ణయం కాలేదు. కథ ఫైనలైజ్ కాగానే అన్ని విషయాలు వెల్లడిస్తాను. ఈ ఏడాదే ఆ సినిమా సెట్స్‌పైకి వస్తుంది. సందేశాత్మక కథను ఎంచుకోవాలా? లేదా వినోదప్రధాన ఇతివృత్తంతో సినిమా తీయాలా? అనే విషయంలో కొంత సందిగ్ధత వుంది. ఎలాంటి సినిమా తీసినా పవన్‌కల్యాణ్ స్టైల్, ఇమేజ్‌కు అనుగుణంగానే వుంటుంది' అన్నారు.

 Pawan Kalyan movie story discussions in progress: Dasari

మళ్లీ మీ దర్శకత్వంలో సినిమా ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నకు స్పందిస్తూ...పవన్‌కల్యాణ్ సినిమా పూర్తయ్యేవరకు నేను దర్శకత్వం గురించి ఆలోచించను అని స్పష్టం చేసారు. దర్శకుడు పూరి జగన్నాథ్ ను తన వారసుడిగా ప్రకటించడంపై స్పందిస్తూ...నిర్మాతల శ్రేయస్సుకు అనుగుణంగా పనిచేసే దర్శకుల్ని నేను బాగా ఇష్టపడతాను. అనుకున్న టైమ్‌లో సినిమా తీయాలి. పెద్దతారలు దొరక్కపోతే...చిన్న వారితోనైనా సినిమాలు తీయగలిగే సత్తా వుండాలి. దర్శకుడనేవాడు సినిమాను అన్నీ తానై నడిపించగలగాలి. ఇలాంటి లక్షణాలున్న దర్శకులే నిర్మాతలకు లాభాల్ని తెచ్చిపెడతారు. ఇప్పటితరంలో ఆ క్వాలిటీస్ వున్న దర్శకుడు పూరి జగన్నాథ్ మాత్రమే అనుకుంటున్నాను. అందుకే అతన్ని నా వారసుడని చెప్పాను.

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ పరిస్థితి ప్రమాదకరంగా, బాధాకరంగా, అస్థిరంగా, అనుమానాస్పదంగా తయారైంది. మార్చాలని చాలాసార్లు ప్రయత్నించాను. కానీ ప్రస్తుతం పరిశ్రమలో మనకంటే తెలివైన వాళ్లు, ఆలోచనలు చేసేవాళ్లు ఎక్కువైపోయారు. అయినా నా వంతుగా ప్రయత్నాలు చేస్తున్నాను. అని దాసరి నారాయణ తెలిపారు.

English summary
Dasari Narayana Rao has now planned to producer Pawan Kalyan's forthcoming movie, and this news has come as a big surprise to many in the Telugu film industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu