»   » పవన్ కళ్యాణ్.... ఈ కన్‌ఫ్యూజన్ ఇంకెన్నాళ్లు???

పవన్ కళ్యాణ్.... ఈ కన్‌ఫ్యూజన్ ఇంకెన్నాళ్లు???

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ సినిమా అంటే తెలుగనాట ఎక్కడ లేని క్రేజ్. అభిమానులు మాత్రమే కాదు, సాధారణ కుటుంబ ప్రేక్షకులు సైతం ఆయన సినిమా వచ్చిదంటే చాలు అంటే థియేటర్ల వైపు పరుగులు పెడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ త్వరలో ‘గబ్బర్ సింగ్-2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం షూటింగులో పాల్గొనలేదు. ఆయన రెండో షెడ్యూల్ లో పాల్గొంటారని చెబుతూ వచ్చారు. జులై రెండో వారంలో సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అప్పట్లో ప్రచారం జరిగినా...జులై నెల పూర్తి కావస్తున్నా ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు.

Pawan Kalyan movie Title To be chnged as Sardar

ఈ సినిమాకు టైటిల్ ‘గబ్బర్ సింగ్ 2' కాదని, ‘సర్దార్' టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారని తాజాగా మరో ప్రచారం మొదలైంది. హీరోయిన్ కూడా ఇంకా ఫైనల్ కాలేదు. పవన్ కళ్యాణ్ సరసన అనీషా ఆంబ్రోస్ నటిస్తుందని అప్పట్లో ప్రచారం జరిగినా.... ఆమె ఇపుడు ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారని తర్వాత తేలింది. హీరోయిన్ ఎవరు అనేది త్వరలో ప్రకటిస్తారట.

ఇలా ఈ సినిమాపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ సందేహాలకు సమాధానం ఇచ్చే వారే కరువయ్యారు. పవన్ కళ్యాణ్ ఇలాంటి విషయాలు అసలు మాట్లాడరనే విషయం అందరికీ తెలిసిందే. కనీసం నిర్మాత శరత్ మరార్, దర్శకుడు బాబీ కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. మరి ఈ సినిమాపై ఈ కన్‌ఫ్యూజన్ ఇంకా ఎన్నాళ్లో...???

భారీ ఢీల్ నిజమేనా?
ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని రూ. 72 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ఇలా అన్నింటిని ఇంత భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది.

English summary
Film Nagar source said that Gabbar Singh 2 Movie Title To be chnged as Sardar.
Please Wait while comments are loading...